Begin typing your search above and press return to search.

ఏబీకి ప్రభుత్వం షాక్

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:52 AM GMT
ఏబీకి  ప్రభుత్వం షాక్
X
వివాదాస్పద ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీ) డిస్మిస్ కు రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేసింది. ఒక ఐపీఎస్ అధికారిని డిస్మిస్ చేయాలంటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సిఫారసు వెళ్ళటం ఇదే మొదటిసారి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించారని ఏబీ వెంకటేశ్వరరావు పై ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే పాయింట్ మీద కూడా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు పై డిసిప్లినర్ యాక్షన్ తీసుకుంది. పై రెండు కారణాలతో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షలో ఉన్నారు.

తన మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తు ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఇప్పటికే క్యాట్, హైకోర్టుతో పాటు సుప్రింకోర్టులో కూడా కేసులు వేశారు. వివిధ కోర్టుల్లో ఈ కేసులపై విచారణ జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు 2018-19 సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు జగన్ పార్టీ అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బాగా రెచ్చిపోయారనే ఆరోపణలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎంఎల్ఏలు ముగ్గురు ఎంపిలు తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించటంలో ఏబీ వెంకటేశ్వరరావు దే కీలకపాత్రగా అనేక ఆరోపణలున్నాయి.

తమపై నిఘా పెట్టేందుకే ఏబి ఇజ్రాయెల్ నుండి నిఘా పరికరాలను తెప్పించి తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు అప్పట్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలు, ఎంపిలు చాలా ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా ఏబీ తన వ్యవహారశైలిని అయితే మార్చుకోలేద. ఒక ఐపీఎస్ అధికారిగా కన్నా చంద్రబాబునాయుడుకు సన్నిహితునిగానే ఏబీ కంటిన్యు అయ్యారు. టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో కూడా బాగా పాతుకుపోయారు. ఏబీ సిఫారసుతోనే దేవినేని అవినాష్ కు పదవి వచ్చిందని మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న పార్టీ సమావేశంలో చెప్పటం అప్పట్లో సంచలనమైంది.

ఇలాంటి నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటంతో ఏబీకి కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ఏబీని సస్పెండ్ చేసి విచారణలు చేస్తోంది. ఒకవైపు విచారణలు, సస్పెన్ష్ ఉండగానే ఏకంగా ఏబీని డిస్మిస్ చేయాలని ప్రభుత్వానికి కేంద్రానికి సిఫారసు చేయటం సంచలనంగా మారింది. సర్వీసులో ఉన్నపుడు ఏబీ వ్యవహారశైలి వల్ల ఆయన సర్వీసులో ఉండేదుకు అనర్హుడని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.