Begin typing your search above and press return to search.

బాబుకు ఇల్లు ఇచ్చేందుకు జ‌గ‌న్ రెడీ

By:  Tupaki Desk   |   17 Aug 2019 6:44 PM IST
బాబుకు ఇల్లు ఇచ్చేందుకు జ‌గ‌న్ రెడీ
X
ఏపీలో వ‌ర‌ద రాజ‌కీయం రోజు రోజుకు జోరందుకుంటోంది. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. నిన్న‌టికి నిన్న మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. బాబుకు సెంటు భూమి కూడా లేద‌ని... ఆయ‌న ఇంటి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే త‌మ ప్ర‌భుత్వం ఇళ్లు ఇచ్చిన‌ప్పుడు త‌మ గ్రామ వ‌లంటీర్ బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లి సెంటో లేదా సెంటున్న‌రో ఇంటి స్థ‌లం ఇస్తార‌ని ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు కూడా మ‌రోసారి ఇదే రేంజ్‌లో సైటైర్ వేశారు. చంద్ర‌బాబు న‌ది ఒడ్డున ఆయన ఇళ్లు మునిగిపోతున్నా ఖాళీ చేయ‌కుండా మొండిగా ఉన్నా.. ఆయ‌న రాజ‌కీయ‌ జీవితం ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌ల కోపంలో మునిగిపోయింద‌న్నారు. శనివారం అంబ‌టి విలేక‌ర్ల‌తో మాట్లాడారు.

చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నార‌ని... ఆయ‌న ఇంటిని, ఆయ‌న్ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంటుంద‌ని.. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇంటిలో వ‌ర‌ద ప‌రిస్థితి ఎలా ఉంద‌ని డ్రోన్లు ద్వారా తెలుసుకుంటే త‌ప్పేంట‌ని అంబ‌టి ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు త‌న భ‌ద్ర‌త దృష్ట్యా వెంట‌నే ఆ ఇళ్లు ఖాళీ చేసి అక్క‌డ నుంచి వెళ్లిపోవాల‌న్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అమ‌రావ‌తిలో సొంత ఇళ్లు నిర్మించుకుని అక్క‌డే ఉంటున్నార‌ని... మ‌రి చంద్ర‌బాబు ఇక్క‌డ ఎందుకు సొంత ఇళ్లు నిర్మించుకోలేద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు.

అమ‌రావ‌తిలో ఇళ్లు క‌ట్టుకునేందుకు చంద్ర‌బాబుకు ఇష్టం లేద‌ని...అందుకే ఆయ‌న అక్ర‌మంగా ఉన్న ఓ ఇంటినే త‌న అద్దె ఇంటిగా మార్చుకుని అక్క‌డే ఉండిపోయార‌ని అంబ‌టి ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆ ఇళ్లు వ‌ర‌ద ముంపుతో ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో నిజ‌మైన బాధ్య‌తాయుత‌మైన పౌరుడిగా చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే ఆ ఇళ్లు ఖాళీ చేయాల‌ని అంబ‌టి సూచించారు.

ఒక వేళ చంద్ర‌బాబుకు ఇళ్లు కావాలంటే ఆ నిబంధ‌న‌ను త‌మ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌క్ష‌ణ‌మే ప‌రిశీలిస్తార‌ని కూడా అంబ‌టి చెప్పారు. ఓ వైపు అక్ర‌మంగా ఉన్న త‌న ఇళ్లు మునిగిపోతే..బాధ్య‌తాయుత‌మైప ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉండి ఇలాంటి అవమానకరమైన ఆరోపణలు చేయడం బాబుకు త‌గ‌ద‌న్నారు. బాబు ప్ర‌వ‌ర్త‌న వ‌ల్లే ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌ని అంబ‌టి విమ‌ర్శించారు.