Begin typing your search above and press return to search.
‘ఒమిక్రాన్’ అసత్య ప్రచారం చేస్తే చర్యలు: ఇప్పటివరకు ఒక్కటీ లేదు
By: Tupaki Desk | 6 Dec 2021 12:28 PM ISTదేశ ప్రజలకు ప్రస్తుతం ‘ఒమిక్రాన్’ భయం పట్టుకుంది. నిన్న ఒక్కరోజే 17 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అధికారికంగా మాత్రం 5 మాత్రమే ఒమిక్రాన్ కేసులు గుర్తించామని అధికారులు అంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయని ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ ప్రచారంపై స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదన్నారు. అయితే తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టిమ్స్ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయితే జీనోమ్ రిపోర్టులు వచ్చాకే నిర్దారించుకోవాలని అన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కొందరు ఊహాగానాలతో తప్పుడుప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటివ ప్రజలు నమ్మొద్దని సూచించారు. కొవిడ్ సోకిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలన్నారు. అప్పుడే జీనోమ్ సీక్వెన్స్ తెలిసిపోతుందన్నారు.
అలాగే మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ గా చికిత్స చేసుకోవడం ద్వారా ఒమిక్రాన్ కేసులు గుర్తించడానికి అవకాశం ఉండదన్నారు.
ఇక బూస్టర్ డోస్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామన్నారు. మరోవైపు చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నామన్నారు. ప్రతి నలుగురలో ఒక్కరికే వ్యాక్సిన్ అందిందని, అందుకే కొత్త వేరియంట్ పుట్టుకొంచిందన్నారు. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ విషయంపై వదంతులు నమ్మొద్దన్నారు. అలాంటి ప్రచారం చేసేవారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
మిగతా వేరియంట్ ల కంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందన్నారు. కానీ వారిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయన్నారు. వాస్తవానికి తీవ్ర ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటే ఒమిక్రాన్ పరీక్ష చేస్తున్నామన్నారు. కానీ టిమ్స్ లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ ఇలాంటి లక్షణాలు లేవన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుడా జాగ్రత్తలు పాటిస్తే చాలన్నారు. గత కొవిడ్ హయాంలో ఆందోలనతోనే చాలా మంది మరణించారని గుర్తు చేశారు.