Begin typing your search above and press return to search.

కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5లక్షలకు ప్రభుత్వ ప్రోత్సాహం !

By:  Tupaki Desk   |   30 Oct 2020 4:50 PM IST
కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5లక్షలకు ప్రభుత్వ ప్రోత్సాహం !
X
ఈ ఆధునిక సమాజంలో కులాల పట్టింపులు, మతాల కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే , మరోవైపు అదే స్థాయిలో యువతి, యువకులు కులాంతర వివాహాల వైపు మొగ్గుచూపుతున్నారు. దీనితో ప్రభుత్వం సైతం వారిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యం లోనే వారికిస్తున్న ప్రోత్సాహాక బహుమానాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఒడిషా ప్రభుత్వం కూడ ప్రస్తుతం ఇస్తున్న దానికంటే భారీగా పెంచింది. ఈ ప్రోత్సాహకం పోర్టల్‌ లో వివరాలను దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా ప్రభుత్వం అందజేయనుంది. ఈ పోర్టల్ పేరు సుమంగళ్. కులాంతర వివాహాలు చేసుకున్న వారి వివరాలను ఇక్కడ నమోదు చేసుకుంటే వారికి ప్రోత్సాహకం అందించడం ద్వారా సమాజంలో సామాజిక సామరస్యం ఏర్పడుతుందని సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇకపోతే, 2018వరకు కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.లక్ష నగదు ప్రోత్సాహకం ఇస్తుండగా దాన్నిప్పుడు రూ.2.5లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఈ నగదు మొత్తం ఏదైనా జాతీయ బ్యాంకులో జంటకు జాయింట్ ఖాతా కలిగి ఉన్నట్లయితే అందులోకి బదిలీ చేయబడుతుందని చెప్పారు. అయితే ఈ నగదును వివాహ జీవితం మూడేళ్లు ముగిసిన తర్వాతే విత్‌ డ్రా చేసుకునేలా ప్రభుత్వం లిటికేషన్ పెట్టింది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కులాంతర వివాహం చేసుకున్న వారి ఆర్థిక పరిస్థితి తో ఎటువంటి సంబంధం లేకుండా ఈ ప్రోత్సాహకం అందివ్వడం జరుగుతుందని ఒడిషా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ ప్రభుత్వ ప్రోత్సాహం అందాలి అంటే .. కులాంతర వివాహాలు చెల్లుబాటులో ఉండి వాటిని హిందూ వివాహ చట్టం కింద నమోదు చేయబడాలి. అలాగే కులాంతర వివాహారం చేసుకుంటున్న ఇద్దరిలో ఎవరో ఒకరు ఎస్సీ కులానికి చెందిన వారై ఉండాలి. స్పష్టంగా చెప్పాలంటే ఒకరు అగ్రకులానికి చెందిన వారై ఉండాలి మరొకరు దిగువ కులానికి చెందిన వారై ఉండాలి. మరో ముఖ్యమైన విషయం .. ఈ ప్రోత్సాహకం తొలిసారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ ప్రోత్సాహకం అందుకునేందుకు వితంతువులు కూడా అర్హులే. ఇక ప్రోత్సాహకం కింద వచ్చే నగదుతో భూమి కొనుగోలు చేయడం కానీ, వ్యాపారం చేసేందుకు కానీ వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఒడిషా ప్రభుత్వం విద్యార్థుల కోసం కూడా మరో పోర్టల్‌ ను ప్రారంభించింది. ఇంటిగ్రేటెడ్ ఒడిషా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్‌ లో అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 8 శాఖలు విద్యార్థులకు స్కాలర్షిప్ ‌లను అందిస్తున్నాయి. దీని ద్వారా 11 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. వీరంతా దళితులు, గిరిజనులు, ఇతర వెనకబడిన వర్గాల వారై ఉండాలి. దీనితో ఎప్పటికప్పుడు కులాంతర వివాహాలపై సమీక్ష జరిపి సరైన ప్రోత్సాహాకాలు అందిస్తే సత్పలితాను అందించే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు..