Begin typing your search above and press return to search.
`ఓటీఎస్`పై జగన్ చేసిన తప్పు ఇదే.. వారికి ఇచ్చి ఉంటే.. బెటరయ్యేదా?
By: Tupaki Desk | 10 Dec 2021 9:28 AM ISTఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన.. తాజా పథకం.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం!. దీనినే షార్ట్ కట్‌లో ఓటీఎస్ అంటున్నారు. అంటే.. వన్ టైమ్ సెటిల్మెంట్. అంటే.. గతంలో 1980ల నుంచి ఉన్న ప్రభుత్వాలు.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చాయి.
జాతీయ రహదారుల విస్తరణ, మురికి వాడల నిర్మూలన వంటి కార్యక్రమాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని వారిని తీసుకువెళ్లి వేరే చోట ఇళ్లు కేటాయించారు. అయితే.. ఇలాంటి కుటుంబాలు ఇళ్లు నిర్మించుకోవడం కష్టమవుతందని భావించి.. ప్రబుత్వాలే.. ఇంటి స్థలంతోపాటు.. ఇంటిని కూడా నిర్మించాయి. దీనికి గాను.. స్థలాన్ని ఫ్రీగానే ఇచ్చినా.. ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని మాత్రం బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నాయి.
దీంతో ఆయా ఇంటి పట్టాలు.. బ్యాంకుల వద్ద.. ప్రభుత్వ గ్యారెంటీతో ఉన్నాయి. ఫలితంగా.. పేదలకు ఇళ్లు దక్కినా.. వాటిపై హక్కులు మాత్రం లేకుండా పోయాయనేది వాస్తవం. ఇంటిని సొంతం చేసుకున్న పేదలకు.. కూడా ఈవిషయం కొద్దో గొప్పో తెలుసు. ఆయా రుణాలు తీర్చేస్తే.. ఇంటిని సొంతం చేసుకునే అవకాశం పేదలకు ఉంది.
తర్వాత..వచ్చిన ప్రభుత్వాలు.. ఈ విషయాన్ని తెలిసి కూడా పేదల ఓటు బ్యాంకు నేపథ్యంలో దీనిని పట్టించుకోకుండా తాత్సారం చేస్తూ వచ్చాయి. అయితే.. ఇటీవల కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకర్లు.. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వానికి వివరించారు.
ఎప్పటి నుంచో మూలుగుతున్న అప్పులను తీర్చే విధానంపై దృష్టి పెట్టాలని..బ్యాంకర్లు జగన్‌కు చెప్పడంతో.. ఆయన వెంటనేజగనన్న సంపూర్ణ గృహ హక్కుకు ప్రతిపాదించారు. తద్వారా.. పేదలకు గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లపై ఉన్న రుణాలను తీర్చేసుకుంటే.. సంపూర్ణ హక్కుదారులు అవుతారని.. ప్రభుత్వం చెబుతోంది.
ఇందులోనూ 85 నుంచి 90 పర్సంట్ రాయితీఇస్తున్నామని.. చెబుతోంది. దీనిలో భాగంగానే గ్రామ పంచాయతీల్లో 10 వేలు, మునిసిపాలిటీల్లో 15 వేలు, కార్పొరేషన్లలో 20 వేలు కట్టి.. సంపూర్ణ హక్కులు పొందాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
అయితే.. ఈ విషయం సంపూర్ణంగా ప్రజలకు అర్ధమయ్యేలా చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. అన్నింటికీ వలంటీర్లనే నమ్ముకున్న ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా వారి చేతిలోనే పెట్టింది.దీంతో వలంటీర్లు.. పథకం మంచి చెడులను వివరించడంలో పూర్తిగా ఫెయిలైపోయారు.
బెదిరించి.. సొమ్ములు వసూలు చేయడంతోపాటు.. టార్గెట్‌లు పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టారు. దీంతో పథకం గురించిన మంచి కన్నా.. వ్యతిరేకతే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభుత్వం పేదలను పిండేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అలా కాకుండా.. ఇలాంటి కీలకమైన పథకాలను వలంటీర్లకు అప్పగించకుండా.. పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపి ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది. వీరికి గ్రామాల్లోనూ.. పట్టణాల్లో నూ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వారు ప్రజలకు నేర్పుగా వినిపించడంలోనూ.. పథకంపై అవగాహన కల్పించడంలోనూ సక్సెస్ అయ్యేవారు. దీంతో ఈ పథకం సక్సెస్ అయి ఉండేదని.. పార్టీలోనే సీనియర్లు గుసగుసలాడుతున్నారు.
ఇలా చేయకపోవడం వల్ల.. ఈ పథకం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని వారు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జగన్ కూడా .. మంచి అవకాశం ఇస్తున్నాం.. వినియోగించుకుంటే మంచిదని .. ముక్తాయించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. `పథకం మంచిదే సార్. కానీ.. వలంటీర్లకు అప్పగించినందున వారు బెదిరిస్తున్నారు. దీంతో మనమేదో తప్పు చేస్తున్నామనే భావన వస్తోంది`` అని వారు అంటున్నారు.