Begin typing your search above and press return to search.

తెలంగాణలో 159 కొత్త బార్లకు సర్కార్​ గ్రీన్​ సిగ్నల్​..

By:  Tupaki Desk   |   26 Jan 2021 10:31 AM IST
తెలంగాణలో 159 కొత్త బార్లకు సర్కార్​ గ్రీన్​ సిగ్నల్​..
X
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు మరో గుడ్​న్యూస్​. రాష్ట్రంలో కొత్తగా మరో 159 బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఈ కొత్త బార్లకు అనుమతులు ఇవ్వనున్నారు. కొత్త బార్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల అదనపు ఆదాయం రాబోతున్నట్టు సమాచారం. అయితే గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 55 బార్లు.. మిగిలిన జిల్లాల్లో 104 బార్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.

ఫిబ్రవరి 8వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.దరఖాస్తుల పరీశీల పూర్తయిన అనంతరం ఆయా జిల్లాల్లో ఫిబ్రవరి 10వ తేదీన డ్రా తీయనున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మాత్రం ఫిబ్రవరి 11వ తేదీన ఎక్సైజ్​ డైరెక్టర్​ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబ్‌‌‌‌లు ఫిక్స్ చేశారు.

50 వేల లోపు జనాభాకు రూ.30 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు 42 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు 44 లక్షలు, 20 లక్షల కంటే పైన ఉంటే 40 లక్షలు ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ విధించనున్నారు. బార్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ వచ్చిన 90 రోజుల్లోపు మొత్తం ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌లోని ఫస్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లించాల్సి ఉన్నది.కొత్తగా మరో 159 బార్ల ఏర్పాటుకు అనుమతించటం మందు బాబులకు పండగేనని అంటున్నారు.