Begin typing your search above and press return to search.

జూడాల సమ్మెకు ముగింపు.. వేతనాలు పెంచిన ప్రభుత్వం

By:  Tupaki Desk   |   27 May 2021 2:30 PM GMT
జూడాల సమ్మెకు ముగింపు.. వేతనాలు పెంచిన ప్రభుత్వం
X
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం ముగింపు పలికింది. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం 15శాతం మేర వేతన పెంపునకు అంగీకరించింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది.

ఇక సీనియర్ రెసిడెంట్ల వేతనాన్ని ప్రభుత్వం రూ.70 వేల నుంచి రూ.80500కు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం నిర్ణయంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు.

ఇక వైద్యులు, హెల్త్ వర్కర్ల కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడితే వారికి నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందించాలన్న డిమాండ్ పై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో రెండు రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. గురువారం నుంచి అత్యవసర సేవలు కూడా బంద్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో కరోనా కల్లోలం వేళ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 15శాతం వేతన పెంపునకు ఆమోదం తెలిపింది.