Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం!
By: Tupaki Desk | 27 Oct 2020 5:00 AM ISTజపాన్ లో జననాల రేటు రోజురోజుకి దారుణంగా తగ్గిపోతుంది. దీనితో జననాల రేటుని పెంచాలనే దిశగా అలోచించి జపాన్ ప్రభుత్వం సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. యువతీ యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా పడిపోతున్న జననాల రేటును తిరిగి గాడిన పెట్టాలని ఆలోచించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్ లు ( అంటే భారత కరెన్సీలో రూ. 4 లక్షలకు పైగా) ప్రోత్సాహక బహుమతి కింద ఇవ్వనుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ సొమ్ము ఎంతగానో పనికివస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా విధించింది. పెళ్లి చేసుకునే జంట మొదట వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, వారి వయసు 40 ఏళ్లకు మించి ఉండకూడదు. వార్షిక ఆదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ ప్రోత్సాహక బహుమతికి అర్హులుగా జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది దేశ వ్యాప్తంగా 8.65 లక్షల మంది మాత్రమే జన్మించడంతో రానురాను జననాల రేటు పడిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించి ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. మరి పథకాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకుని దేశ జనాభాను ఏమాత్రం పెంచుతారో చూడాలి.