Begin typing your search above and press return to search.

గొరిల్లాల వీడియో ఇప్పుడెందుకు వైరల్ అంటే?

By:  Tupaki Desk   |   4 Oct 2019 5:37 PM IST
గొరిల్లాల వీడియో ఇప్పుడెందుకు వైరల్ అంటే?
X
మనిషి పుట్టక అన్నంతనే కోతి నుంచి అని చాలామంది చెబుతారు. దానికో థియరీ కూడా ఉంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. అది నిజమనిపించటం ఖాయం. అమెరికాలోని దక్షిణ కరోలినా జూలో కనిపించిన ఒక సీన్ ను ఒకరు వీడియో తీయటంతో ఇప్పుడిది వైరల్ అయ్యేలా చేసింది.

అక్కడి జూలో గొరిల్లాలు మనుషుల మాదిరే వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. వర్షం పడుతున్న వేళ.. గొరిల్లాలు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. వారు వర్షంలో తడవకుండా ఉండేందుకు పడిన తపన చూస్తే.. మనుషులకు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఉండటం విశేషం.

అంతేకాదు.. వర్షం కారణంగా తమకు ఎదురైన అసౌకర్యాన్ని వాటి ముఖంలో కనిపించిన భావాలు చూస్తే.. నిజంగానే మనుషుల మాదిరే వ్యవహరించాయే అనిపించక మానదు. వర్షం పడుతుంటే.. జూకు వచ్చిన సందర్శకులంతా గాజు అద్దాల వెనుక నుంచి చూస్తుండటంతో.. వీడియో తీసే వీలు కుదిరింది.

మనుషుల మాదిరే గొరిల్లాలలో కూడా పురుషాధిక్యం ఎక్కువగా.. బాధ్యతల బరువుల్ని ఆడ గొరిల్లాలు మోయాలన్నట్లుగా వ్యవహరించిన తీరు చూస్తే.. కోతుల నుంచే మనుషులు వచ్చి ఉంటారనిపించక మానదు. పిల్లల సంరక్షణ బాధ్యతల్ని ఆడ గొరిల్లాలకు అందించిన మగ గొరిల్లాలు.. రాజసంతో ఉండిపోతే.. ఆడ గొరిల్లాలలో మాత్రం పిల్లల విషయంలో ఆదుర్దా.. ఆందోళన కనిపించింది. బాధ్యతలు ఏమీ లేకుండా మగ గొరిల్లాలు వ్యవహరించిన తీరు చూస్తే.. 70.. 80లలో నాన్నలు కాస్త గుర్తుకు రావటం ఖాయం.

వీడియో కోసం క్లిక్ చేయండి