Begin typing your search above and press return to search.

పార్టీలోనూ ప్రజల్లోనూ రచ్చ.. ఎంపీ మాధవ్ ఎంచక్కా పార్టీ మీటింగ్ లోనా?

By:  Tupaki Desk   |   6 Aug 2022 6:55 AM GMT
పార్టీలోనూ ప్రజల్లోనూ రచ్చ.. ఎంపీ మాధవ్ ఎంచక్కా పార్టీ మీటింగ్ లోనా?
X
రెండు రోజలుుగా నానా రచ్చగా మారింది వైసీపీ వ్యవహారం. అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు రాయలేని రీతిలో వ్యవహరించినట్లుగా ఆరోపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ.. ఏపీ రాజకీయాల్లోనూ ఎంతటి సంచలనంగా మారాయో.. పార్టీ ఇమేజ్ ఇంత దారుణంగా దెబ్బ తీశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నగ్న వీడియోలతో అందరికి షాకులు ఇచ్చిన వైసీపీ ఎంపీ మాధవ్.. తనను దెబ్బ తీయటానికి వీలుగా మార్పింగ్ వీడియోల్ని ప్రయోగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

నగ్న వీడియోలు నిజమని తేలిపై చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల సైతం చెప్పిన వేళ.. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. వైసీపీ ఎంపీ మాధవ్ కు చెందిన వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో విపక్షాలు ఆయన్ను తన పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లొల్లి భారీగా సాగుతోంది.

ఓవైపు మీడియాలో.. మరోవైపు అధికార పార్టీలోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మాధవ్ కారణంగా లేనిపోని తిప్పలు ఎదురయ్యాయని.. ఇప్పుడున్నవి సరిపోనట్లు.. ఇప్పుడీ రచ్చ మనకు అవసరమా? అంటూ సొంత పార్టీకి చెందిన నేతలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఎంపీ మాధవ్ ఎక్కడ? అన్న ప్రశ్నకు బదులుగా ఫోటోతో సమాధానం బయటకు వస్తోంది.

తనకు చెందినట్లుగా చెబుతున్న నగ్న వీడియోల రచ్చ నడుస్తున్న వేళ.. నానా బూతులతో దారుణంగా వ్యాఖ్యలు చేసిన మాధవ్.. ఇప్పుడు ఎంచక్కా పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. పార్టీకి చెందిన మిగిలిన ఎంపీలతో కలిసి ఢిల్లీలో సమావేశంలో ఆయన ఎంచక్కా దర్జాగా పాల్గొంటున్నారు.

మొత్తానికి తన కారణంగా పార్టీ పరువు బజారన పడిందని వాపోయే పార్టీ నేతల తీరుకు భిన్నంగా.. బిందాస్ గా పార్టీ మీటింగ్ కు హాజరు కావటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసిందన్న మాట వినిపిస్తోంది.