Begin typing your search above and press return to search.
వైసీపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 18 May 2018 5:20 PM ISTవైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్రకు అశేష ప్రజానీకం నుంచి విపరీతమైన స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. తమ జిల్లాల్లో పర్యటిస్తోన్న జననేత జగన్ కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జననేత అడుగులో అడుగు వేసి నడిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరేందుకు పలువురు కీలకనేతలు సిద్ధమవుతున్నారు. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్ సమక్షంలో మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత తన అనుచరులతో కలిసి నేడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ఆమె అనుచరులందరూ శుక్రవారం నాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జగన్ కు నానాటికీ జనాదరణ పెరిగిపోతోంది. జననేతకు వస్తోన్న ఆదరణ చూసి అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ తప్పక విజయం సాధిస్తారని, ఆయనతో పాటు అడుగులోఅడుగు వేసేందుకు తాము కూడా సిద్ధమని పలువురు నేతలు అంటున్నారు. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది కూడా జగన్ తో కలిసిపనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత వైసీపీలో చేరారు. ఆమెని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున గోపాలపురం నియోజకవర్గం నుంచి సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. త్వరలో మరింతమంది కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.