Begin typing your search above and press return to search.
భారత్ లో ఆ సేవల్ని బంద్ చేసిన గూగుల్
By: Tupaki Desk | 19 Feb 2020 2:00 AM ISTనిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ కోట్లాది మంది ఎంగేజ్ అయ్యే వాటిల్లో కీలకం గూగుల్. ఇవాల్టి రోజున పూట గడవాలంటే గూగుల్ లేకుండా సాధ్యం కాని పరిస్థితికి వచ్చేశాం. అంతలా మన జీవితాల్లో భాగస్వామ్యమైన గూగుల్.. దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్నికల్పించే ప్రాజెక్టును కొన్నేళ్ల క్రితం మనం అడగకుండానే షురూ చేసింది.
ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టును భారత్ లో తాము కొనసాగించలేమని తేల్చేసింది. ఎందుకిలా? అన్న ప్రశ్న వేయటానికి ముందే గూగులే అసలు విషయాన్ని చెప్పేసింది. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. భారత్ లో డేటా ధరలు కారుచౌకగా ఉన్నాయని.. అలాంటప్పుడు ఉచిత వైఫై అందివ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇతరదేశాలతో పోలిస్తే ఇంటర్నెట్ సేవలు చౌకగా మారిన వేళ.. దేశంలోని రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫైని తీసివేయాలని తాము నిర్ణయించినట్లుగా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ గుప్తా తెలిపారు. భారత్ తో పాటు దక్షిణాఫ్రికా.. నైజీరియా.. థాయ్ లాండ్.. ఫిలిప్పీన్స్.. మెక్సికో.. ఇండోనేషియా.. బ్రెజిల్ దేశాల్లోనూ గూగుల్ స్టేషన్లను ఎత్తేస్తున్నట్లుగా పేర్కొంది.
తాము ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించే సమయంతో పోలిస్తే.. ఇప్పుడు నెట్ ధరలు 95 శాతం తగ్గిందని పేర్కొంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10జీబీ డేటాను ఉపయోగిస్తున్నట్లు పేర్కొంటున్న వేళ.. తన అవసరం లేదనిగూగుల్ డిసైడ్ అయి.. ప్రాజెక్టును ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. గూగుల్ మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. వాడేందుకు డేటా వాడినా.. ఇంటర్నెట్ సిగ్నల్ చాలా చోట్ల స్టాంగ్ గా ఉండదు.రైల్వే స్టేషన్ లాంటి పబ్లిక్ ప్లేసుల్లో కనెక్టివిటీ సమస్య ను కూడా ఎదుర్కొనే పరిస్థితి. ఇలాంటప్పుడు గూగుల్ వైఫై కేంద్రాలు సాయం చేస్తాయని చెప్పొచ్చు. గూగుల్ తాజా నిర్ణయం కాస్త నిరాశకు గురి చేసేదే.