Begin typing your search above and press return to search.
గూగుల్ ప్లే స్టోర్ లోనకిలీ ధరణి యాప్.. ఏం జరిగిందంటే?
By: Tupaki Desk | 29 Nov 2020 12:40 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి యాప్ ను అనుకరిస్తూ..తాజాగా ఒక నకిలీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ధరణి పోర్టల్ మీదా.. అందులోని డేటా మీదా పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడో కొత్త చిక్కు ఎదురైంది. ఇప్పటివరకు ఉన్న రిజిస్ట్రేషన్ విధానాన్ని పూర్తిగా మార్చే క్రమంలో ధరణి పోర్టల్ ను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం.
ఇందులో భూ రికార్డులు.. పహాణీ.. ఫామ్ బీ 1 తదితరాల్ని ఉంచారు. అయితే.. అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి మొబైల్ యాప్ ను రూపొందించారు. దీన్ని గమనించిన కర్ణాటకు చెందిన ఇద్దరు యువకులు ఒక మొబైల్ యాప్ రూపొందించారు. ధరణి నకిలీ యాప్ తయారు చేస్తే.. పెద్ద ఎత్తున డౌన్ లోడ్ లకు అవకాశం ఉంటుందన్న కక్కుర్తితో దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు.
తమకున్న నాలెడ్జ్ తో మొబైల్ యాప్ ను సిద్ధం చేసిన వారు గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ చేశారు. ఈ నకిలీ ధరణి యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ఓపెన్ చేస్తే.. అది కాస్తా వెబ్ ఫార్మాట్ లోకి మారి.. ధరణి పోర్టల్ వద్ద ఆగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు హైదరాబాద్ నగర సైబర్ సెల్ కు కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కర్ణాటక వాసుల్ని (ప్రేమ్.. మహేశ్) అరెస్టు చేశారు. అయితే.. ధరణిని పోలే నకిలీ యాప్ తయారు చేయటంతో పాటు.. మరింకేం చేశారన్న విషయంపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.