Begin typing your search above and press return to search.

గూగుల్ లేఆఫ్.. నేటి నుంచి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం..!

By:  Tupaki Desk   |   21 Jan 2023 11:17 AM GMT
గూగుల్ లేఆఫ్.. నేటి నుంచి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం..!
X
కరోనా పరిస్థితులు.. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా కాలంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించిన కంపెనీలు ఇప్పుడు మాత్రం ఉద్యోగులపై వేటుకు సిద్ధమవుతున్నాయి. వరుసబెట్టి సాప్ట్ వేర్.. ఇ కామర్స్ సంస్థలన్నీ పొదుపు చర్యల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడేస్తుండటం శోచనీయంగా మారింది.

ఇటీవలే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కంపెనీలో 18వేల ఉద్యోగులను తొలగించింది. అలాగే క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడరైన సేల్స్‌ఫోర్స్ 7వేల కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అమెజాన్ బాటలోనే మైక్రోసాప్ట్ సైతం తన ఉద్యోగులను ఇంటిముఖం పట్టించేందకు సిద్ధమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో నుంచి సుమారు ఐదు శాతం మేర కోత విధించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ శాతం సుమారు 11 వేల మంది ఉద్యోగులతో సమానంగా ఉండనుందని సమాచారం వచ్చే వారం త్రైమాసిక ఆదాయానికి ముందే తొలగింపు ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 2023 ఏడాది ప్రారంభం నుంచే టెక్ దిగ్గజ కంపెనీలను ఉద్యోగులను భారీగా తొలగింపు ప్రక్రియను చేపడుతుండటం గమనార్హం.

తాజాగా ఈ లిస్టులోకి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ కూడా చేరింది. నేటి నుంచి ఆ కంపెనీకి చెందిన 12వేల మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులో ఉద్యోగులు పొందే అన్ని ప్రయోజనాలను ఆయన పేర్కొన్నందున ఆ తర్వాతి మెయిల్లో లేఆఫ్ కు సంబంధించిన న్యూస్ ఉండోచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

దీంతో ఈ మోమోలో ఇంటి నుండి పని చేయమని రాసిన చివరి లైన్‌లో మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మేరకు గూగుల్ సీఈవో లేఖలో పేర్కొంటూ.. మేము మా వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12,000 పాత్రలు తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఈమేరకు ప్రభావితమైన ఉద్యోగులకు ఇప్పటికే ప్రత్యేక ఇమెయిల్‌ను పంపించినట్లు తెలిపారు.

ఇతర దేశాల్లోని స్థానిక చట్టాలు మరియు అభ్యాసాల కారణంగా కొన్ని చోట్ల కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రతిభావంతమైన ఉద్యోగులకు వీడ్కోలు పలుకనుండటం బాధాకరమన్నారు. ఈ మార్పు అంత సులభం కానప్పటికీ ఉద్యోగులు వారి తదుపరి అవకాశం కోసం చూస్తున్నప్పుడు తమ మద్దతు వారికి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ లో కనీసం 60 రోజుల్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. అదనపు ప్రోత్సహాలు అందిస్తామని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.