Begin typing your search above and press return to search.
శ్రీవారి భక్తులకి శుభవార్త .. వాళ్లందరికీ ఎప్పుడైనా ఉచిత దర్శనం!
By: Tupaki Desk | 12 Sept 2020 12:45 PM ISTగోవిందా ..గోవిందా .. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమలేశుని దర్శనం కోసం ప్రతి ఒక్కరు తిరుమలకి లక్షల్లో వెళ్లేవారు. ప్రపంచ నలుమూలల నుండి శ్రీవారి దర్శనం కోసం భక్తులు వచ్చేవారు. కానీ , కరోనా కారణంగా తిరుమలలో భక్తులని పరిమితం చేసారు. కేవలం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నవారిని మాత్రమే కొండపైకి వెళ్ళనిస్తున్నారు. కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి ఎంతోమంది భక్తులు దూరం కావడంతో .. టీటీడీ శ్రీవారి భక్తుల కోరిక మేరకు కొన్ని సేవలు ఆన్లైన్ లో నిర్వహిస్తుంది.
ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకి శుభవార్త అందించింది. ఆన్ లైన్ కల్యాణోత్సవం లో పాల్గొనేవారికి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. వారు టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోపు ఎప్పుడైనా కూడా సుపథం ప్రవేశమార్గం నుంచి ఉచితంగా శ్రీవారిని దర్శించుకోవచ్చునని వెల్లడించింది. ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. రోనా నేపథ్యంలో టీటీడీ ఏర్పాటు చేసిన ఆన్ లైన్ కల్యాణోత్సవ సేవలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 7వ తేదీన ఈ సేవలను మొదలుపెట్టగా, అప్పటి నుంచి ఈ నెల 7 వరకు దాదాపుగా 8,330 టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవ సేవలు ప్రారంభమవుతాయి.