Begin typing your search above and press return to search.
బీటెక్ కూడా తెలుగు లో చదవాలనుకునేవారికి గుడ్ న్యూస్ ... ఏంటంటే ?
By: Tupaki Desk | 11 March 2021 4:45 PM ISTభారతదేశంలో అనేక రకాల మతాల, కులాలకు సంబంధించిన ప్రజలు కలిసి మెలిసి జీవనం సాగిస్తారు. దేశ భాష హిందీ అయినప్పటికీ , దేశంలో పలు ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. అయితే , ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రం ఇప్పటివరకు ఇంగ్లీష్ లోనే విద్యాబోధన జరుగుతుంది. అయితే, భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే , మాతృభాషలో బోధన అనేది అన్ని బ్రాంచీల్లోకాకుండా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సీఎస్‌ఈ తదితర సంప్రదాయ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో మాత్రమే మాతృ భాషలో బీటెక్ ను బోధించేందుకు అనుమతులు ఇవ్వబోతుంది. అలాగే , మాతృభాషలో బీటెక్ కోర్సులు బోధించే కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ బీఏ) గుర్తింపు ఉన్న బ్రాంచీలకు మాత్రం అని నిబంధన విధించింది. ఏ బ్రాంచీకి ఎన్ బీఏ ఉంటే అందులో ఒక సెక్షన్ ఇస్తారు. సాధారణంగా ఒక సెక్షన్ అంటే 60 సీట్లు కాగా ,సగం సెక్షన్ 30 సీట్లు కూడా ఇస్తారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈని కూడా సంప్రదాయ బ్రాంచీగానే లెక్కిస్తారు.
బుధవారం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్ మెంట్, పాలిటెక్నిక్ కళాశాలల యజమానులు, ఇతర ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. నిబంధనల్లో మార్పులు, చేర్పులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కళాశాలల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఏఐసీటీఈ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్ధే సమాధానమిచ్చారు. సాధారణంగా ఏప్రిల్ 30వ తేదీ నాటికి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా, కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జూన్ 30వ తేదీ నాటికి ఇస్తామని, అందుకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటామన్నారు.