Begin typing your search above and press return to search.
తెలంగాణకు శుభవార్త ... రీజినల్ రింగ్ రోడ్డుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ !
By: Tupaki Desk | 23 Feb 2021 6:00 AM ISTతెలంగాణ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సూత్రపాయ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ చుట్టూ 354 కిలోమీటర్ల పొడవున ఆర్‌ఆర్‌ఆర్ ప్రతిపాదించి, అనుమతుల కోసం సీఎం కేసీఆర్ పలు విడతలుగా కేంద్రానికి లేఖలు రాశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ మహానగరం మరింత అభివృద్ధిపథంలో పయనిస్తుంది, పారిశ్రామికంగా పురోగమిస్తుంది. సంగారెడ్డి , గజ్వేల్ ,చౌటుప్పల్ , భువనగిరి ప్రాంతాలని కలుపుతూ ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపుగా రూ. 7 వేల కోట్లు , అలాగే భూ సేకరణకు రూ. వెయ్యి కోట్లకి పైగా ఖర్చు చేయబోతుంది అని అయన తెలిపారు. ఈ రీజినల్ రింగ్ రోడ్డు తో మొత్తం తెలంగాణ రూపు రేఖలే మారుతాయని అన్నారు. ఈ జాతీయ రహదారికి ఎన్ హెచ్ 161ఏఏగా నామకరణం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ఆర్‌ఆర్‌ఆర్ ఎంతో ఉపయోగపడబోతుంది.
హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. దీనికి వెలుపల సిటీకీ 50, 60 కిలోమీటర్ల దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని 2016లో స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 338 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 15 వేల కోట్లకుపైగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో ప్రాజెక్టును రెండు ఫేజ్లుగా విభజించారు. ఈ ప్రాజెక్టును ఆమోదించి, జాతీయ రహదారిగా గుర్తించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2018 డిసెంబర్‌లో సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు ఫస్ట్ ఫేజ్ లో నిర్మించే 152 కిలోమీటర్ల ప్రాజెక్టును జాతీయ రహదారిగా గుర్తిస్తూ నంబర్ కేటాయించింది.
ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు స్వరూపం
హైవే పొడవు : 338 కిలోమీటర్లు, ఆరు లైన్లు
ఫస్ట్ ఫేజ్ : 152 కిలోమీటర్లు (తూప్రాన్ – గజ్వేల్- జగదేవ్ పూర్ -భువనగిరి – చౌటుప్పల్)
సెకండ్ ఫేజ్ : 186 కిలోమీటర్లు (చౌటుప్పల్ – యాచారం – కడ్తాల్ – షాద్ నగర్ – చేవెళ్ల – శంకర్‌పల్లి – కంది)
కవరయ్యే జిల్లాలు: 5, నియోజకవర్గాలు : 9
మొత్తం ప్రాజెక్టు వ్యయం : రూ.15 వేల కోట్లు
కావాల్సిన భూమి : 11 వేల ఎకరాలు
భూసేకరణకు : రూ.9 వేల కోట్లు
ట్రిపుల్ ఆర్ తో కలిసే జాతీయ రహదారులు: ఎన్ హెచ్ – 65, ఎన్‌హెచ్ – 44, ఎన్‌హెచ్ – 163, ఎన్‌హెచ్ – 765