Begin typing your search above and press return to search.

పబ్​జీ లవర్స్‌ కు గుడ్​ న్యూస్​.. ఇండియాకు వచ్చేసిన గేమ్​! ఫ్రీ రిజిస్ట్రేషన్లు షురూ

By:  Tupaki Desk   |   15 Nov 2020 4:01 AM GMT
పబ్​జీ లవర్స్‌ కు గుడ్​ న్యూస్​.. ఇండియాకు వచ్చేసిన గేమ్​! ఫ్రీ రిజిస్ట్రేషన్లు షురూ
X
ఇండియాలో కొంతకాలంగా పబ్​జీ నిషేధించడంతో పబ్​జీ ప్రేమికులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పబ్​జీ చైనా యాప్​ కావడం, భద్రతా అంశాలు ముడిపడి ఉండటంతో ఈ యాప్​ను దేశంలో నిషేధించారు. గతంలో చాలామంది పబ్​జీకి బానిసలై ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో పలు స్వచ్ఛందసంస్థల వాళ్లు పబ్​జీని తీవ్రంగా వ్యతిరేకించారు. వివిధ రకాల కారణాలతో పబ్​జీని కేంద్రప్రభుత్వం నిషేధించింది. కానీ పబ్​జీ గేమ్​ మళ్లీ ఇండియాకు వచ్చేసింది. ఈ సారి సరికొత్త ఫీచర్లు మోసుకొని వచ్చింది. దీంతో ప్రస్తుతం పబ్​జీ ప్రేమికులంతా ఫుల్​ ఖుషీ అవుతున్నారు. ఈ ఆన్​లైన్​ గేమ్​కు మనదేశంలో హయ్యెస్ట్‌ ఫ్యాన్‌బేస్‌ ఉంది. ప్రస్తతుం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. కొత్త వెర్షన్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్ కూడా మొదలయ్యింది.

పబ్‌‌జీ‌ని ప్రమోట్‌ చేస్తున్న టెన్సంట్‌ కంపెనీ చైనాకు చెందినది కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌లో ఎలాగైనా అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్న పబ్‌‌జీ మాతృసంస్థ క్రాఫ్టన్‌… తగు చర్యలు తీసుకుంది. టెన్సంట్‌‌తో తెగతెంపులు చేసుకుంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌కి చెందిన అజ్యూర్‌ క్లౌడ్‌ సర్వీస్‌తో ఒప్పందం చేసుకుంది. చైనాతో సంబంధాలు తెంచుకోవడంతో పబ్‌జీ‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం నుంచి అనుమతులు రావడంతో ఆండ్రాయిడ్‌, యాపిల్‌ వెర్షన్‌లకు తగ్గట్టుగా గేమ్‌ని కొత్తగా తీసుకు రాబోతుంది. పాత వెర్షన్‌కి అనేక హంగులు జోడించింది. టైమ్‌ లిమిట్‌, హిట్టింగ్‌ ఎఫెక్ట్స్‌లో ఈ మార్పులు ఉండబోతున్నాయి. ఈ మేరకు కమింగ్ సూన్‌ అంటూ ఫేస్‌బుక్‌లో ఉన్న పబ్‌జీ మొబైల్‌ ఇండియా వాల్‌‌పై పేర్కొంది.

ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ని పోస్ట్‌ చేసింది. ఇప్పటికే లక్షల సంఖ్యలో గేమ్‌ కోసం రిజిష్ట్రేషన్లు మొదలైపోయాయి. లేటెస్ట్‌ వెపన్స్‌తో.. ఫ్రెండ్స్‌ అంతా కలిసి టీములుగా ఏర్పడి ఆన్లైన్‌లో గేమ్‌ ఆడే అవకాశం ఉన్న పబ్‌జీకి యువత పట్టం కట్టింది. అయితే ప్రస్తుతం పబ్​జీ తిరిగివస్తుండటంతో కొంమంది తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొని ఉన్నది. ఇంతకాలం పబ్​జీ గేమ్​ లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్న పిల్లలు.. మళ్లీ ఈ గేమ్​ బానిసలు అయిపోతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.