Begin typing your search above and press return to search.

సెక్స్ వర్కర్లకు గుడ్ న్యూస్: ఇకనుంచి వారికి..

By:  Tupaki Desk   |   15 Dec 2021 9:30 AM GMT
సెక్స్ వర్కర్లకు గుడ్ న్యూస్: ఇకనుంచి వారికి..
X
సెక్స్ వర్కర్లకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చే విషయం చెప్పింది. ఇప్పటికే వారిని సాధారణ పౌరులుగానే ట్రీట్ చేయాలని, వారికి మిగతావారిలాగే సౌకర్యాలు అందించాలని పేర్కొన్న సుప్రీం వాటిని అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా వారికి ప్రభుత్వ, సంక్షేమ పథకాలను అందించాలని తెలిపింది. గతేడాది కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వీరిని ఆదుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా వారికి సంక్షేమ పథకాలు కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్-19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్స్ వర్కలను ఆదుకోవాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిని విచారించి కోర్టు గతేడాది సెప్టెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులను మరోసారి ప్రస్తావించింది. వృత్తితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు ఉంటాయని, సెక్స్ వర్కర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. దీంతో వారికి కూడా రేషన్ కార్డులు, ఇతర సదుపాయాలు అందించాలని తెలిపింది. గుర్తింపు కార్డు, ఆధారాలతో సంబంధం లేకుండా వారికి సంక్షేమ పథకాలు అందించాలని పేర్కొంది. జస్టిస్ నాగేశ్వర్ రావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడి త్రిసభ్య ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేసింది.

ఈ సందర్భంగా వారు సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు మంజూరే చేయాలని వాదించారు. దీంతోన్యాయస్థానం వారి వాదనలను ఏకీభవించి ఆదేశాలు జారీ చేసింది. అయితే 2011లో సుప్రీం కోర్టు ఈ అంశంపై జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్రాలను ప్రశ్నించింది. ‘సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని దాదాపు దశాబ్ధం కిందట రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ అమలు చేయలేదు. ’ అని కోర్టు తెలిపింది.

‘దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులు లభిస్తాయిన రాజ్యాంగం సూచిస్తుంది. ఇందులో భాగంగా సెక్స్ వర్కర్లు కూడా పౌరుల్లో భాగమే. అందువల్ల వారికి రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలి. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది.

సెక్స్ వర్కర్ల వివరాల కోసం ఎయిడ్స్ నియింత్రణ సంస్థ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీల సాయం తీసుకోవాలని, వీటి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం సెక్స్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అందించాలని తెలిపింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టులను నాలుగు వారాల్లోగా సమర్పించాలని కోర్టు తెలిపింది. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఇందులో పాలు పంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.