Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ కు గుడ్ న్యూస్: సచివాలయ కూల్చివేతకు హైకోర్టు పచ్చజెండా
By: Tupaki Desk | 29 Jun 2020 4:00 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సచివాలయ నిర్మాణానికి ముందడుగు పడింది. తాజాగా హైకోర్టులో పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ట్యాంక్ బండ్ పై ఉన్న సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో నిర్ణయించారు. దానికి అనుగుణంగా ప్లాన్లు.. డిజైన్.. నిధుల కేటాయింపు అన్నీ పూర్తయ్యాయి. కొత్త సచివాలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. అయితే దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో కొన్ని నెలలుగా విచారణ సాగుతోంది. తాజాగా హైకోర్టు నిర్ణయంతో పాత సచివాలయ భవనాలు కూల్చివేసి కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సులువైంది.
సచివాలయ కూల్చివేతకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీనిపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించి సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం తేల్చి
చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని.. సచివాలయ కూల్చివేత ఆపాలని హైకోర్టు లో పది పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై సోమవారం విచారణ జరగ్గా ప్రభుత్వ వాదనలతో ఏఖిభవించిన ధర్మాసనం.. సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్ని తొలిగిపోయాయి.