Begin typing your search above and press return to search.

ఏపీ వాసులకి శుభవార్త ..లాక్ డౌన్ నుండి వాటికీ కూడా మినహాయింపు !

By:  Tupaki Desk   |   30 May 2020 8:10 AM GMT
ఏపీ వాసులకి శుభవార్త ..లాక్ డౌన్ నుండి వాటికీ కూడా మినహాయింపు !
X

దేశ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ 4.0 మే 31 కి ముగియనుంది. ఇక ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. అయితే, లాక్ డౌన్ ౪ లో ప్రభుత్వాలు భారీగా సడలింపులు ఇచ్చాయి. ఇప్పటికే లాక్ ‌డౌన్ నుండి భారీగా‌ సడలింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది.

ముఖ్యంగా రవాణా రంగానికి మినహాయింపులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం .రాష్ట్రంలో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్ల మినహా ,రాష్ట్ర పరిధిలోని ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నడిచేందుకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ వాహనాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్ ‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

అయితే 50 శాతం సీట్లతో ప్రయాణానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతిచ్చారు. అలాగే ప్రభుత్వ చూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇక రాష్ట్రంలో 25 శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, బస్సులలో 45 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో వస్తుందని ఏపీ సర్కార్ పేర్కొంది. మొత్తానికి మరికొన్ని లాక్ డౌన్ మినహాయింపులతో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇక అదే సమయంలో కరోనా కట్టడి కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. అంతే కాదు జూన్ 1 తర్వాత కేంద్రం మార్గదర్శకాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే, జూన్ 1 తర్వాత 28 రైళ్లు రాష్ట్రం మీదుగా వస్తున్నాయని తెలిపారు.

ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 11,638 శాంపిల్స్ ‌ను పరీక్షించగా 33 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి అని, అలాగే మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2037 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 777 మంది చికిత్స పొందుతున్నారు అని ప్రకటించింది.