Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఉన్న ఏపీ వారికి గుడ్ న్యూస్.. కండీషన్స్ అప్లై
By: Tupaki Desk | 14 May 2020 10:00 AM ISTఅనూహ్యంగా ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీకి చెందిన వేలాది మంది హైదరాబాద్ లో ఉండిపోయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి వెళ్లేందుకు అవకాశం లేకపోవటంతో హైదరాబాద్ లోనే ఉండిపోయారు. రవాణా సౌకర్యం లేకపోవటంతో ఎలా వెళ్లాలో అర్థం కాక కిందామీదా పడుతున్న పరిస్థితి. పోలీసు పాసుల కోసం అప్లై చేసుకొని.. వారాల తరబడి వెయిట్ చేస్తున్న వారి సంఖ్యే వేలాదిగా ఉంది. ఇలాంటి వారి కోసం ఏపీ సర్కారు తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
హైదరాబాద్ నుంచి ఏపీలోని తమ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్ లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి 8 వేల మంది.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐదు వేల మంది ఏపీకి వెళ్లేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని అప్లై చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో ఉన్న పదమూడు వేల మందిని ఏపీకి చేర్చేందుకు వీలుగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మరో రెండు.. మూడు రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ బస్సుల్ని మియాపూర్.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు.. ఎల్బీ నగర్ ల మీదుగా నడుపుతారు. ఎంపిక చేసిన చోట్ల బస్సుల్ని ఆపి ప్రయాణికుల్ని ఎక్కించుకుంటారు. తర్వాత మధ్యలో మరెక్కడా ఆపకుండా గమ్యస్థానాలకు చేరుస్తారు.
ఈ బుకింగ్ ల కోసం ఆన్ లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారంతా తప్పని సరిగా క్వారంటైన్ నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా పద్నాలుగు రోజులు ఉండాల్సి ఉంటుంది.
ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ.. నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ ఛార్జీలు తీసుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం విజయవంతమైతే.. తర్వాతి దశల్లో బెంగళూరు.. చెన్నై నగరాల్లో ఉన్న ఏపీ ప్రజల్ని రాష్ట్రానికి తిరిగి తీసుకురానున్నారు. ఇప్పటివరకూ స్పందన పోర్టల్ లో నమోదు చేసుకున్న వారి వివరాల ప్రకారం.. బెంగళూరులో 2700 మంది.. చెన్నైలో 1700 మంది స్పందన పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తీపికబురు తాజాగా వచ్చినట్లుగా చెప్పక తప్పదు.