Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ ... 16 నుండి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ !
By: Tupaki Desk | 10 Jan 2021 7:00 AM ISTదేశ ప్రజలు గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఘట్టానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట కరోనా వైరస్ యోధులకు, 50 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలకు పుణే నుంచి వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
జనవరి 13 నుంచి టీకా వేస్తారంటూ ఇటీవల పేపర్లు, టీవీ, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. జనవరి 16వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని భారత ప్రభుత్వం చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించింది. ఈనెల 11న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ వర్చువల్ భేటీకి ముందే కేంద్రం వ్యాక్సిన్ డ్రైవ్ మీద ఓ నిర్ణయానికి వచ్చింది.
ప్రధాని మోదీ నిర్వహించిన హైలెవల్ కమిటీ సమావేశానికి కేంద్ర కేబినెట్ సెక్రటరీ, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సంబంధించిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌కు ఎంత సన్నద్ధంగా ఉన్నారనే అంశంపై సమగ్రంగా చర్చించారు. కరోనా వ్యాక్సిన్లు లకు ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతిపై కూడా చర్చించినట్టు తెలిసింది.