Begin typing your search above and press return to search.
కొండెక్కిన బంగారం.. రికార్డు ధర.. ఏంతంటే?
By: Tupaki Desk | 7 March 2020 4:45 PM ISTబంగారం కొండెక్కింది. మరింత రేటు పెరిగింది. దేశంలో పసిడి ధరలు మరింతగా పెరిగాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ.773 పెరిగి ఏకంగా రూ.45,343 లకు చేరింది. హైదరాబాద్ లో అయితే మరింత ఎక్కువగా రూ.45,990గా ఉంది.
ఇక బంగారమే కాదు.. వెండి ధర కూడా ఎగబాకింది. కిలో వెండి ధర రూ.192 పెరిగి తాజాగా రూ.48,180కి చేరింది.
కాగా బంగారం ధర పెరగడానికి కరోనా ఎఫెక్ట్ కారణంగా చెబుతున్నారు. కరోనా ధాటికి ఇన్వెస్టర్లు భయపడి తమ పెట్టుబడులను భద్రంగా బంగారం, వెండిలోకి మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండికి అనూహ్యంగా ధర పెరిగిపోతోంది.
ఇక బంగారం రేట్లు పెరగడానికి రూపాయి విలువ దారుణంగా పతనం కూడా కారణంగా తెలుస్తోంది. గురువారం మార్కెట్లో రూ.200 పెరిగిన బంగారం.. ధర శుక్రవారం ఏకంగా రూ.900 ఎగిసింది.
ప్రస్తుతం బంగారం ధర రూ.45వేలు దాటుతుందని.. పసిడి రానున్న రోజుల్లో మరింత పెరగడం ఖాయమని బులియన్ వర్తకులు భావిస్తున్నారు.