Begin typing your search above and press return to search.

బంగారు మాస్క్‌.. ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు

By:  Tupaki Desk   |   4 July 2021 10:30 AM GMT
బంగారు మాస్క్‌.. ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు
X
కరోనా నుండి వ్యాక్సిన్‌ కంటే మాస్క్‌ మరియు శానిటైజర్‌ మాత్రమే ఎక్కువ రక్షణ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. మాస్క్‌ సక్రమంగా ధరిస్తే కరోనా నుండి దూరంగా ఉండటం 90 శాతం వరకు సాధ్యం అంటూ నిపుణులు చెబుతున్నారు. రెండు మాస్క్‌ లను సరిగ్గా ధరించి ముక్కు మరియు నోరును కవర్‌ చేయడం వల్ల ఖచ్చితంగా కరోనా వైరస్ కు దూరంగా ఉండవచ్చు అంటూ అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సంస్థల ప్రతినిధులు కూడా చెబుతున్నారు. మాస్క్‌ లు తప్పనిసరి అయిన ఈ సమయంలో కొందరు మాస్క్ లను చిత్ర విచిత్రంగా ధరిస్తున్నారు. మాస్క్‌ ధరించకుంటే ఫైన్‌ విధిస్తుండటంతో కొందరు మాస్క్‌ లు ధరిస్తున్నట్లుగా కలరింగ్ ఇవ్వడం కోసం మూతి వరకు పెట్టుకోవడం లేద.. గదమ కు పెట్టుకుని ఉండటం చేస్తున్నారు.

మాస్క్ లను అలా ధరించడం వల్ల అస్సలు ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా కు దూరంగా ఉండాలంటే నోరు మరియు ముక్కు నూటికి నూరు శాతం కవర్‌ అయ్యి పక్క నుండి కూడా కనీసం గాలి దూరకుండా ఉండాలి. పీల్చే గాలి ఖచ్చితంగా మాస్క్‌ ద్వారా ఫిల్టర్ అయ్యి రావాలి. అప్పుడే మాస్క్ బటయే కరోనా వైరస్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నివారణకు తప్పనిసరిగా మాస్క్‌ లు వాడాలంటే కొందరు చిత్ర విచిత్రమైన మాస్క్‌ లను తయారు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన గోల్డెన్‌ బాబా ఏకంగా బంగారంతో మాస్క్ ను తయారు చేయించాడు. ఆయన తయారు చేయించిన మాస్క్‌ ఖరీదు అక్షరాల అయిదు లక్షలు. సరే అంత ఖర్చు పెట్టి తయారు చేయించాడు కదా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆ గోల్డ్‌ మాస్క్ వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

యూపీ కాన్పూర్‌ కు చెందిన మనోజ్‌ సెంగార్‌ కు బంగారం అంటే మహా పిచ్చి. ఆయన బంగారం ను ఒంటి నిండుగా వేసుకునే ఉంటాడు. అందుకే ఆయన్ను గోల్డెన్ బాబా అని కూడా అంటారు. కరోనా కారణంగా ఆయన తన మాస్క్‌ ను కూడా బంగారంతో తయారు చేయించుకోవాలనే ఆలోచనతో ఏకంగా అయిదు లక్షలు ఖర్చు చేసి స్థాయిన బంగారు ఆభరణాల తయారి వ్యక్తి వద్ద చేయించుకున్నాడు. అతడి బంగారు మాస్క్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడి మాస్క్ ఖరీదు ఎంత.. ఎలా చేశారు అనే విషయానలు తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదే సమయంలో ఆ మాస్క్ ఎంత వరకు సేఫ్‌ అంటూ కొందరు ఎంక్వౌరీ చేయగా నిపుణులు మాత్రం ఆ మాస్క్ వల్ల జీరో ప్రయోజనం అంటున్నారు. మాస్క్ అనేది గాలిని ఫిల్టర్ చేసి ముక్కు మరియు నోరు ద్వారా శరీరంలోకి వెళ్లేలా చేస్తుంది. కాని గోల్డ్‌ మాస్క్ అనేది గాలిని ఫిల్టర్ చేయడం సాధ్యం కాదు. బంగారం నుండి గాలి ప్రసరించదు. కనుక పక్క నుండి ఆయన గాలి పీల్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాస్క్ ధరించి ఏం ప్రయోజనం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన బంగారు మాస్క్‌ కేవలం అతి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.