Begin typing your search above and press return to search.

16 నెలల తర్వాత గోల్డ్‌ లేడీ రిలీజ్

By:  Tupaki Desk   |   6 Nov 2021 1:35 PM GMT
16 నెలల తర్వాత గోల్డ్‌ లేడీ రిలీజ్
X
16 నెలల క్రితం కేరళలో వెలుగు చూసిన అతి పెద్ద గోల్డ్‌ స్మగ్లింగ్‌ కుంభకోణంలో ప్రథాన నింధితురాలు అయిన స్వప్న సురేష్ ఎట్టకేలకు జైలు నుండి బయటకు వచ్చారు. భారత దౌత్య అధికారుల పేరుతో ఈ భారీ స్మగ్లింగ్‌ ను సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. స్వప్న సురేష్‌ కేరళలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన ఆ స్మగ్లింగ్‌ కేసులో ఈడీ.. ఎన్‌ఐఏ.. యూఏపీఏ అధికారులు భాగస్వామ్యం అయ్యి విచారించారు. స్వప్న సురేష్‌ 16 నెలలుగా బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమెకు నవంబర్ 2న కేరళ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం జరిగింది. బెయిల్‌ పేపర్స్ తో స్వప్న సురేష్ తల్లి జైలుకు చేరుకుని కూతురును విడిపించుకుని వెళ్లారు.

బెయిల్‌ కోసం స్వప్న సురేష్‌ 25 లక్షల రూపాయల బాండ్లు.. ఇద్దరు వ్యక్తుల పూచీ కత్తుతో పాటు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు అవ్వాలనే కండీషన్స్ తో ఈ బెయిల్‌ ను మంజూరు చేయడం జరిగింది. ఎన్‌ఐఏ అభియోగాలు మోపిన దాని ప్రకారం విదేశాల నుండి అక్రమంగా ఆస్తులను ఇండియాకు తీసుకు రావడం.. ఇక్కడ వాటికి పన్ను చెల్లించక పోవడం. ఇది ఆర్థిక నేరం కిందకు వస్తుంది. కనుక ఈడీ కూడా ఈ కేసు విచారణలో భాగస్వామ్యం అయ్యింది. దేశ దౌత్య విభాగంపైనే అనుమానాలు కలిగేలా ఈ కేసు తీరు ఉందంటూ జాతీయ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి ఒక కుంభకోణం జరుగుతుందని ఊహించడానికే విడ్డూరంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తిరువనంతపురం ఎయిర్ పోర్ట్‌ కు దౌత్య మార్గాల ద్వారా పార్శిల్‌ వచ్చింది. దానిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఓపెన్‌ చేయగా అందులో 30 కేజీల బంగారం ఉంది. ఆ బంగారంకు సంబంధించి ఎలాంటి లెక్కలు కాని పత్రాలు కాని లేవు. దాంతో తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పటికి కూడా ప్రథాన నింధితులు బయట తిరుగుతున్నారు అనే వాదన వినిపిస్తంఉది. స్పప్న సురేష్ ఈ వ్యవహారంలో అసలైన వ్యక్తుల పేర్లు చెప్పలేదని.. అలాగే ఆమె అంతకు ముందు జరిగిన ఈ స్మగ్లింగ్ గురించి కూడా ఎలాంటి వివరాలు చెప్పలేదు అనేది టాక్‌.