Begin typing your search above and press return to search.
గోఎయిర్ విమానం..అత్యవసరంగా పాక్ లో ల్యాండ్..ఇంతకీ ఏం జరిగింది?
By: Tupaki Desk | 18 Nov 2020 3:40 PM ISTరియాధ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఓ విమానం అర్జెంట్‌గా పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే ఓ ప్రయాణికుడికి (30) అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందట. అయితే గుండెపోటుకి గురైన వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. రియాధ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన గోఎయిర్ G8-6658A విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. దీంతో ఫైలట్ విమానాన్ని కరాచీలో జిన్నా ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ చేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు తెలిపింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలోనూ పలుమార్లు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. రెండేళ్ల క్రితం పాకిస్థాన్ కు చెందిన ఓ విమానం జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం తలుపు తెరుచుకున్నట్లు గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరాడు.
అయితే నిన్న విమానం కరాచీలో ల్యాండ్ అయినట్టు వార్తలు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. విమానం దాయాది దేశమైన పాకిస్థాన్ లో ల్యాండ్ కావడమే అందుకు కారణం. చివరకు మెడికల్ ఎమర్జెన్సీ అని తెలియడం.. కొద్దిసేపటికే విమానం ఢిల్లీకి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానాలు వివిధ అత్యవసర పరిస్థితుల వల్ల వేరే చోట ల్యాండ్ అవడం మామూలేనని విమానయానశాఖ అధికారులు తెలిపారు.