Begin typing your search above and press return to search.
*మోదీ చప్పట్ల వెనుక సీక్రెట్ ఇదేనా..*
By: Tupaki Desk | 22 March 2020 4:54 PM ISTదేశమంతా జనతా కర్ఫ్యూలో భాగమైంది. ప్రజలు ఇష్ట పూర్వకంగానే ఇళ్లకు పరిమితమవుతున్నారు. రానున్న వైరస్ విలయాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి ఇంటి నిర్బంధం తప్పదని ప్రజలు తెలుసుకున్నారు. కొన్ని రాష్ట్రాలైతే మోదీ చెప్పిన 14 గంటలను మించి 24 గంటల కర్ఫ్యూ పాటించడానికీ నిర్ణయించాయి. ఇవన్నీ పక్కన పెడితే మోదీ ఇచ్చిన పిలుపు లో మరో అంశమూ ఉంది. అది.. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా తమ ఇళ్ల ముందుకు కానీ, బాల్కనీలకు కానీ వచ్చి చప్పట్లు కొట్టడం.
జనతా కర్ఫ్యూతో పాటు మోదీ చెప్పిన ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.. అదే సమయంలో ఇలా చప్పట్లు కొట్టమనడం వెనుక ఉన్న కారణాలు, దీనివల్ల కలిగే ఫలితాలు అంటూ మద్దతుగానూ పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికత జోడించి ఇది మంచి ఆలోచన అని చెప్పే పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.
ఆధ్యాత్మిక పద్ధతుల్లో రోగాలను, జబ్బులను నయం చేయొచ్చనేవారు చెప్పే నెగటివ్ ఎనర్జీస్‌ను అడ్డుకోవడం అనే కోణంలో కొందరు దీన్ని విశ్లేషిస్తున్నారు. జనతా కర్ఫ్యూ పాటిస్తున్న మార్చి 22కి మూడు రోజుల తరువాత అమావాస్య వస్తుందని.. అమావాస్య వంటి సమయాల్లో నెగటివ్ ఎనర్జీస్ బాగా శక్తిమంతంగా ఉంటాయని... ఇలాంటి వైరస్‌లు కూడా నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్ నుంచి వెలువడేవే కాబట్టి అమావాస్య రోజు లేదా అప్పటికి ఇవి మరింత ప్రమాదకరంగా మారొచ్చని.. ఆ పరిస్థితిని నివారించడానికి ఈ చప్పట్ల టెక్నిక్‌ను మోదీ వాడుతున్నారని అంటున్నారు. అయితే, చప్పట్లు ఎలా రెమిడీయో కూడా వారు చెబుతున్నారు. 130 కోట్ల భారతీయులు ఒకే సమయంలో చప్పట్లు కొట్టడం వల్ల వెలువడే ధ్వని తరంగాలు దేశమంతా ఒకే తరంగదైర్ఘ్యంతో పాకి ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్‌ని బలహీనంగా మార్చగలవని చెబుతున్నారు.
మరో వైపు మార్చి 22 సాయంత్రం 5 గంటల సమయంలో చంద్రుని సంచారం రేవతి నక్షత్రానికి దగ్గరగా ఉందని.. గంటలు మోగించటం, చప్పట్లు కొట్టడం వల్ల సంచిత కంపనం శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహించి మానవ శరీరానికి వైరస్‌లను తట్టుకునే శక్తినిస్తాయని చెబుతున్నారు. ఇవన్నీ అశాస్త్రీయమంటూ చాలామంది కొట్టిపారేస్తున్నా శబ్దానికి ఉన్న శక్తి గురించి, శబ్దానికి ఉన్న అనేక సామర్థ్యాల గురించి శాస్త్రవేత్తలకూ తెలుసు. ఈ నేపథ్యంలో దీని ఫలితాలు ఎలా ఉన్నా మోదీకి ఎవరో కానీ మంచి సలహా ఇచ్చారని అంటున్నారు.
మరోవైపు ఈ చప్పట్లు కొట్టడం వెనుక ఉన్న ప్రయోజనాలను నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక పెద్ద సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజల్లో ఐక్యత ఏర్పరచడానికి, స్ఫూర్తి కలిగించడానికి, ధైర్యం నింపడానికి సింబాలిక్ గా ఇది పనిచేస్తుందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కూడా చెంచాలు, గరిటలు వంటివి కొట్టమని కోరానని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ చప్పట్లు కొట్టాలని ఆయన కోరారు.