Begin typing your search above and press return to search.

చెక్ బౌన్స్ కేసు లిక్కర్ కింగ్ ను చుట్టుకుంది

By:  Tupaki Desk   |   21 April 2016 4:41 AM GMT
చెక్ బౌన్స్ కేసు లిక్కర్ కింగ్ ను చుట్టుకుంది
X
వేలాది కోట్ల రూపాయిల అప్పుల్ని ఎగ్గొట్టి.. గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నెత్తికి మరో కేసు చుట్టుకుంది. దాదాపురూ.9వేల కోట్ల మేర బ్యాంకుల దగ్గర అప్పులు చేసిన మాల్యా.. పెద్ద మొత్తాలేకాదు.. చిల్లర మొత్తాల విషయంలోనూ కక్కుర్తిని ప్రదర్శించినట్లుగా తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది.

మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ వేస్ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను వినియోగించుకున్నందుకు రూ.8 కోట్ల మేర చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను నిర్వహించే జీఎంఆర్ కు ఇచ్చారు. అయితే.. మాల్యా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో మాల్యా మీద చర్యలు తీసుకోవాలంటూ జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది.

ఈ వ్యవహారం మీద విచారణ జరిపిన కోర్టు.. మాల్యా చెక్ బౌన్స్ కు పాల్పడినట్లుగా నిర్ధారించింది. దీనికి సంబంధించిన తుది తీర్పును వెలువరించాల్సి వచ్చింది. బ్యాంకుల దగ్గర తీసుకున్న రూ.9వేల కోట్ల అప్పును ఎగ్గొట్టిన ఉదంతంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో కానీ.. జీఎంఆర్ కు ఇవ్వాల్సిన రూ.8 కోట్ల మొత్తానికి కాను 11 కేసులు నమోదు కావటం గమనార్హం.