Begin typing your search above and press return to search.

ఇక జీమెయిల్‌ తో డ‌బ్బులు పంపించుకోవ‌చ్చు

By:  Tupaki Desk   |   16 March 2017 5:30 PM GMT
ఇక జీమెయిల్‌ తో డ‌బ్బులు పంపించుకోవ‌చ్చు
X
టెక్నాల‌జీ అందిస్తున్న ఫ‌లాల్లో మ‌రో క‌లిసి వ‌చ్చిన అవ‌కాశం. ఐఎంపీఎస్ - యూపీఐ - నెఫ్ట్ - ఆర్‌ టీజీఎస్ - ఆధార్ పే వంటి రక రకాల మార్గాల్లో ప్రస్తుతం వినియోగదారులు డబ్బులు పంపుకుంటున్నారు - తీసుకుంటున్నారు. అయితే ఇకపై మరో కొత్త మనీ ట్రాన్స్‌ ఫర్ విధానం అందుబాటులోకి రానుంది. అయితే అది ప్రభుత్వం - బ్యాంకులు ప్రవేశపెడుతున్న మనీ ట్రాన్స్‌ ఫర్ విధానం కాదు. సాఫ్ట్‌ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రవేశపెడుతున్న ఓ సరికొత్త మనీ ట్రాన్స్‌ఫర్ పద్ధతి అది. యూజర్లు కేవలం ఓ జీమెయిల్ ఐడీ కలిగి ఉంటే చాలు, దాని ద్వారా డబ్బులు పంపేందుకు, తీసుకునేందుకు వీలు కలుగుతుంది.

జీమెయిల్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ ఫాంపై వాడుతున్న యూజర్లు ఇకపై నేరుగా ఈ-మెయిల్స్ పంపడం ద్వారానే డబ్బులు ట్రాన్స్‌ ఫర్ చేసుకోవచ్చు-తీసుకోవచ్చు. అందుకు గాను ఓ కొత్త ట్రాన్స్‌ ఫర్ పద్ధతిని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ విధానం వ‌ల్ల యూజర్లు అవతలి వ్యక్తి మెయిల్ ఐడీ - ఎంత డబ్బు పంపుతున్నారో ఆ మొత్తాన్ని మెయిల్‌ లో ఇచ్చే ప్రత్యేక ఆప్షన్‌ లో ఎంటర్ చేస్తే చాలు. దీంతో అవతలి వ్యక్తులకు క్షణాల్లోనే మెయిల్ ద్వారా డబ్బు అందుతుంది. దాన్ని వారు బ్యాంకుకు ట్రాన్స్‌ ఫర్ చేసుకోవచ్చు. అందుకు గాను ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఈ విధానం ప్రస్తుతం అమెరికాలోని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్‌ ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/