Begin typing your search above and press return to search.

చైనాలో జీ మెయిల్స్​ వాడరు.. దానికీ ఓ లెక్కుంది

By:  Tupaki Desk   |   25 Sept 2020 5:00 AM IST
చైనాలో జీ మెయిల్స్​ వాడరు.. దానికీ ఓ లెక్కుంది
X
చైనా వాళ్లు చేసే ప్రతిపనికి ఓ లెక్కుంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో.. నూతన ఆవిష్కరణలు చేపట్టడంలో పనులను వేగంగా చేయడంలో.. తక్కువ ధరకు వస్తు ఉత్పత్తి చేసి మార్కెట్​ చేసుకోవడంతో వాళ్లకు వాళ్లే సాటి. అయితే తాజాగా జరిగిన ఓ పరిశోధనలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. అదేమిటంటే మిగతా ప్రపంచ దేశాలకంటే చైనీయులు చాలా తక్కువ శాతం మంది మాత్రమే జీ మెయిల్స్​ వాడతారట. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆఫీసు పనులకు జీ మెయిల్స్​ను ఉపయోగిస్తుంటారు. కానీ చైనాలో మాత్రం జీ మెయిల్ ​కు ప్రత్యామ్నాయంగా వీచాట్​ యాప్​ ను వినియోగిస్తున్నారు.

నిజానికి ఆ దేశం లో వీచాట్​ యాప్​ చాలా మంది ఉపయోగిస్తారు. ఆఫీసు పనులు, నగదు చెల్లింపులు, ఆన్​లైన్​ షాపింగ్​ వంటి వాటికి ఈ యాప్​ను వినియోగిస్తుంటారు. అయితే ఇప్పడు జీమెయిల్ కు ప్రత్యామ్నాయంగా కూడా వీ చాట్​ ను ఉపయోగిస్తున్నారట.

ఆఫీస్​ కార్యకలాపాల కోసం ప్రజలు ఏ యాప్స్​ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని డెల్లాయిట్​ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో ఆధారంగా అమెరికా, బ్రిటన్​ దేశాల్లో 85-90 శాతం మంది ఈ మెయిల్స్​ వాడుతుండగా.. చైనాలో చాలా తక్కువమంది ఈమెయిల్స్​ వినియోగిస్తున్నారని తేలింది. చైనాలో స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నవారిలో దాదాపు 79% మంది వీచాట్ వాడతారట. చైనీయులు వీచాట్​ ను ఎక్కువగా ఉపయోగించడానికి ప్రధాన కారణం వారి స్వదేశీ మోజు ఒకటైతే.. రెండో ఈ యాప్​ చాలా వేగంగా పనిచేస్తుండటం మరో కారణం. అయితే మిగతా దేశాల ప్రజలు ఆఫీసు పనుల కోసం జీమెయిల్స్​, నగదు బదిలీలు, చెల్లింపుల కోసం ఇతర యాప్​ లు, ఆన్ ​లైన్​ షాప్​ల కోసం ఇతర యాప్​ లు వాడతారు. అయితే ఒక్క వీచాట్​ యాప్​ లో ఆన్​లైన్​ షాపింగ్​, మెసేజింగ్​, డిజిటల్​ పేమెంట్​ వంటి అన్ని ఫీచర్లు ఉండటం తో వారు ఈ యాప్​ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.