Begin typing your search above and press return to search.

గ్లోబల్ ఆసుపత్రి ఎండీ సంచలన కంప్లైంట్.. బెదిరిస్తోంది అల్లుడేనట

By:  Tupaki Desk   |   30 Jun 2021 3:00 PM IST
గ్లోబల్ ఆసుపత్రి ఎండీ సంచలన కంప్లైంట్.. బెదిరిస్తోంది అల్లుడేనట
X
హైదరాబాద్ మహానగరంలో పేరున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒకటి గ్లోబల్ ఆసుపత్రి. తరచూ ఏదో ఒక వివాదంలో ఈ ఆసుపత్రి పేరు వార్తల్లో నలుగుతూ ఉంటుంది. రోటీన్ కు భిన్నంగా ఈసారి ఆ ఆసుపత్రి ఎండీ పోలీసుల్ని ఆశ్రయించారు. ఒక ఫిర్యాదు ఇచ్చారు. అది కూడా తన అల్లుడి మీదా.. తన కుమారుడి మామ మీద. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూపు వ్యవస్థాపక ఛైర్మన్ కమ్ డైరెక్టర్ అయిన డాక్టర్ కంచర్ల రవీంద్రనాథ్ జూబ్లీహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు.

ఆయన ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల్ని చూస్తే.. ఆస్తి వ్యవహారంలో తమ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. తాను సంపాదించిన ఆస్తిలో 70 శాతానికి పైనే తాను నిర్వహించే గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ కు ఇస్తానని చెప్పటంతో కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు పేర్కొన్నారు.

బంజారాహిల్స్ లోని ఉండే తన అల్లుడు సూరజ్ తేజ్.. జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి వచ్చి మరీ బెదిరించాడన్నారు. అతడితో పాటు.. చెన్నైలో నివసించే తన కొడుకు మామ (వియ్యంకుడు) కూడా కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. తన దగ్గర లైసెన్సెడ్ గన్ఉందని.. దానికి పని చెప్పాలా? అంటూ బెదిరింపులకు దిగారని.. కొంతకాలంగా తన సెల్ ఫోన్ ను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. మూడునెలల్లో విషయం తేల్చకపోతే అంతుచూస్తామని బెదిరించినట్లుగా కంప్లైంట్ ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు.