Begin typing your search above and press return to search.

ఆ క్యాచ్‌ను చూసి ప్రేక్షకులు స్టన్‌ అయ్యారు!

By:  Tupaki Desk   |   11 Oct 2016 4:25 AM GMT
ఆ క్యాచ్‌ను చూసి ప్రేక్షకులు స్టన్‌ అయ్యారు!
X
ఈ మద్యకాలంలో ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిన తర్వాత యంగ్ క్రికెటర్లు చేస్తున్న బ్యాటింగ్, ఫీల్డింగ్ విన్యాశాలు ప్రేక్షకులకు సూపర్ థ్రిల్ ని అందిస్తున్నాయి. అతి తక్కువ బంతుల్లో సెంచరీలు చేయడం, మెరుపు ఫీల్డింగ్ తో అంచనాలు తలకిందులు చేయడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఉత్తమమైన టీం అనేది ఫీల్డింగ్ బాగా చేస్తుంది, క్యాచెస్ విన్ మ్యాచెస్ వంటి కామెంట్స్ కి ఫీల్డింగ్ గురించి నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇదే క్రమంలో తాజాగా ప్రేక్షకులకు, బ్యాట్స్ మెన్ కు కలిపి తన మెరుపు ఫీల్డింగ్ తో అద్భుతమైన క్యాచ్ పట్టి షాకిచ్చాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్ వెల్!

ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి వార్తల్లో నిలిచిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌... తాజాగా ఒక మెరుపు క్యాచ్‌ తో అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ని కుదిపేస్తోంది. మెటాడర్‌ కప్‌ లో భాగంగా విక్టోరియా బూష్‌ రేంజర్స్‌, వారియర్స్‌ మధ్య వన్డే మ్యాచ్‌ పెర్త్‌లో జరిగింది. ఈ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న వారియర్స్‌ బ్యాట్స్‌మన్‌ డీ ఆర్కీ షార్ట్‌ భారీ షాట్‌ కొట్టాడు. మాములుగా అయితే మరోసందేహం లేకుండా అది సిక్సర్‌ అయ్యేది. కానీ బౌండరీ వద్ద కాచుకొని నిలబడిన గ్లేన్‌ మాక్స్‌ వెల్‌ అమాంతం గాలిలోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టి, తాను కిందపడేలోపు గాల్లోనే బంతిని తిరిగి మైదానంలోకి విసిరేశాడు. ఆ సమయంలో రెడీగా ఉన్న రాబ్‌ క్వినీ దానిని అందుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌ ను చూసి ప్రేక్షకులు స్టన్‌ అవ్వగా - బ్యాట్స్‌మన్‌ డీ ఆర్కీ ఒకింత షాక్‌ తో కూడిన నిరాశతో పెవిలియన్ కు చేరాడు. గ్లేన్‌ చేసిన ఈ మెరుపు క్యాచ్‌ ఫీట్ నెట్‌ లో వైరల్‌ గా మారి సంచలనం సృష్టిస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/