Begin typing your search above and press return to search.

ఈవీఎంలను ట్యాంపర్ చేయడం నిరూపిస్తాం!

By:  Tupaki Desk   |   3 April 2017 1:17 PM GMT
ఈవీఎంలను ట్యాంపర్ చేయడం నిరూపిస్తాం!
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఒకింత గ్యాప్ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన ఢిల్లీ సీఎం - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రివాల్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ను ట్యాంప‌రింగ్ చేయ‌వ‌చ్చు అని కేజ్రివాల్ ప్ర‌క‌టించారు. అత్యాధునిక సాఫ్ట్‌ వేర్‌ తో అది సాధ్య‌మే తెలిపారు. ఈవీఎంల కోసం వాడే సాఫ్ట్‌ వేర్‌ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ ప్ర‌జ‌ల‌కు బ‌హిర్గ‌తం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఇటీవ‌ల అయిదు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నిక‌ల్లో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆమ్ ఆద్మీతో పాటు బీఎస్పీ పార్టీ కూడా ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ ట్యాంప‌రింగ్ అంశంపై స‌వాల్ చేశారు. కాన్పూర్‌ లో వాడిన సుమారు 300 ఈవీఎంల‌ను ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో జ‌రిగిన ఎన్నిక‌ కోసం పంపార‌ని, ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చిన త‌ర్వాత సుమారు 45 రోజుల వ‌ర‌కు వాటిని మ‌ళ్లీ వాడ‌రాదు అని, కానీ ఆ నియ‌మావ‌ళిని ఎన్నిక‌ల సంఘం ఉల్లంఘించింద‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. మార్చి 11న యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించార‌ని, అంటే ఏప్రిల్ 26 వ‌ర‌కు వాటిని వాడ‌రాద‌ని, కానీ యూపీ ఎన్నిక‌ల‌కు ఆ మెషీన్ల‌ను తీసుకెళ్లిన‌ట్లు కేజ్రీ ఆరోపించారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా ట్యాంపరింగ్‌ కు పాల్ప‌డే ఎత్తుగ‌డ‌ల‌ను ఉప‌యోగించార‌ని కేజ్రీ విమ‌ర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/