Begin typing your search above and press return to search.

అమ్మాయిల శానిటరీ పాడ్స్ కనిపించాయని దారుణం

By:  Tupaki Desk   |   1 May 2019 4:26 PM IST
అమ్మాయిల శానిటరీ పాడ్స్ కనిపించాయని దారుణం
X
పంజాబ్ లోని బటిండా అకాల్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయిలు అని కూడా చూడకుండా వారి పట్ల యూనివర్సిటీ సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. ఇది బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.

పంజాబ్ లోని అకాల్ యూనివర్సిటీలో అమ్మాయిల హాస్టల్ లోని వాష్ రూంలో శానిటరీ ప్యాడ్స్ పెద్ద ఎత్తున కనిపించాయి.దీంతో హాస్టల్ వార్డెన్ సెక్యూరిటీ గార్డులను పిలిపించి ఈ ప్యాడ్స్ ఏ అమ్మాయిలు ఇక్కడ పడేశారో తేల్చాలని ఆదేశించాడు. దీంతో అమ్మాయిలను గదులను తనిఖీ చేసి పీరియడ్స్ ఉన్న వారిని లైన్లో నిలబెట్టి వార్డెన్ అవమానించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడడంతో పెద్ద దుమారం రేపింది.

ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. దీంతో స్పందించిన అధికారులు ఇద్దరు సెక్యూరిటీ అధికారులు, సదురు వార్డెన్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటన పంజాబ్ అంతటా కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.

గత ఏడాది నవంబర్ లో కూడా పంజాబ్ లోని ఫజిల్కా జిల్లాలో విద్యార్థినుల శానిటరీ ప్యాడ్స్ ధరించారో లేదో తెలుసుకునేందుకు ఉపాధ్యాయినీలు విద్యార్థినుల బట్టలు విప్పించడం కలకలం రేపింది. విద్యార్థులు సోషల్ మీడియాలెో ఏడుస్తూ పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఆ ఇద్దరు టీచర్లు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు కూడా పంజాబ్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.