Begin typing your search above and press return to search.
బాయ్ ఫ్రెండ్ కోసం నడి రోడ్డు మీద ఎంతలాకొట్టేసుకున్నారంటే?
By: Tupaki Desk | 14 Aug 2021 9:00 AM ISTఅమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు.. లేదంటే ముగ్గురు అబ్బాయిలు కొట్టుకోవటం రోటీన్. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నమైన సీన్ కు వేదికగా మారింది జార్ఖండ్ రాష్ట్రంలోని జరాయేల్కా పట్టణం. తన బాయ్ ఫ్రెండ్ మరో మహిళతో సన్నిహితంగా ఉన్న వైనాన్ని రోడ్డు మీద చూసిన వెంటనే.. మరో గర్ల్ ఫ్రెండ్ చెలరేగిపోయింది. తామున్నది రోడ్డు మీద అన్న విషయాన్ని పట్టించుకోలేదు. చుట్టు ఉన్న జనాల్ని లైట్ తీసుకున్నారు. నేరుగా వెళ్లేసి చెంపలు వాయించేసి.. పిడిగుద్దులు గుద్దటం మొదలు పెట్టింది.
బాయ్ ఫ్రెండ్ వెంట ఉన్న అమ్మాయికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తను కూడా అంతలానే ప్రతిఘటించింది. ఈ వీధి పోరు రోడ్డు మీద పడిపోయి కుస్తీ పోటీగా మారింది. వారి పోరాటం బాక్సింగ్ రింగ్ ను తలపించింది. చుట్టూ ఉన్న ప్రజలంతా అక్కడేం జరుగుతుందో తొలుత అర్థం కాకున్నా.. తర్వాత అర్థమై తమ చేతుల్లోని ఫోన్లకు పని చెప్పారు. ఈ ఇద్దరు యువతులు కొట్టుకోవటాన్ని నివారించేందుకు బాయ్ ఫ్రెండ్.. గొడవ పెట్టుకున్న అమ్మాయి స్నేహితురాలు ప్రయత్నించారు. ఎంతలా కష్టపడినా వారి సిగపట్లను ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు.
ఈ అనూహ్య ఘటన పోలీసుల చెవిన పడటం.. వారు హుటాహుటిన వచ్చేందుకు ప్రయత్నించటం.. విషయం తెలిసిన అమ్మాయి కాస్త వెనక్కి తగ్గటంతో ఈ వీధిపోరుకు బ్రేక్ పడింది. బాయ్ ఫ్రెండ్ కోసం గొడవ పడిన ఇద్దరు యువతులు సంపన్నులు కావటం ఒక విశేషం అయితే.. ఇద్దరు చదువుకున్న వారే కావటం మరో సిత్రం. స్థానికుల కథనం ప్రకారం గొడవ పడిన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అయిన అబ్బాయి మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భరించలేకపోయింది. ఆమెతో గొడవ పడింది. ఈ గొడవ అనంతరం.. దెబ్బలు తిన్న గర్ల్ ప్రెండ్ ను అబ్బాయి ఊరడించటం.. గొడవ పడిన అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేయటం కనిపించింది. పోలీసులు వచ్చేసరికి గొడవ పడిన అమ్మాయి.. ఆమె స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో చోటు చేసుకున్న గొడవ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏమైనా బాయ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవ పడిన తీరు మాత్రం షాకింగ్ గా మారింది.