Begin typing your search above and press return to search.

శిల్పారామం... శృంగారధామం

By:  Tupaki Desk   |   17 Nov 2016 7:56 AM GMT
శిల్పారామం... శృంగారధామం
X
అక్కడ పొదలే గదులు.. పగలే రేయి.. గంటగంటకూ కొత్త జంట.. జంటజంటకూ సుఖాల పంట. ఇంతకూ ఇదెక్కడో తెలుసా..? కోల్ కతా సోనాగచ్చీనో.. ముంబయి కామాటిపురానో.. ఢిల్లీలోని జీబీ రోడ్లోనో.. పుణెలోని బుధవారం పేటలోనో కాదు. ఏడుకొండలవాడు కొలువైన తిరుపతి నగరంలో.. అదీ శిల్పారామం పేరుతో ప్రజలు కుటుంబాలతో సహా సరదాగా - సంప్రదాయబద్దంగా గడపడానికి ఉద్దేశించిన ప్లేసులో. అవును... తిరుపతి శిల్పారామం ఇప్పుడు శృంగార ధామంగా మారిపోయింది. బెంచీల మీదే జంటల కిస్సింగులు... క్రోటన్ మొక్కల వెనుక కక్కుర్తిలు.. ఒకటేమిటి అన్నీ అయిపోతున్నాయక్కడ. దీంతో చిన్నారులు - సీనియర్ సిటిజన్లు - కుటుంబాలతో వచ్చేవారు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి వచ్చిన వారు అక్కడి పరిస్థితి చూసి రెండో సారి రావడం మానేస్తున్నారు. అక్కడకు వెళ్తే తమనూ అదే గాటన కట్టేస్తారని ఆ ఛాయలకే పోవడం లేదట.

భక్తిభావ - సంప్రదాయ సుమగంధాలను వెదజల్లాల్సిన పుణ్యధామం అశ్లీల కార్యకలాపాలకు వేదికవుతోంది. తిరుపతి - తిరుచానూరు రోడ్డులో ఉన్న శిల్పారామం జంటలకు సుఖాల పంట అందించే ఏరియాగా మారిపోయింది. అంతేకాదు... తమ అశ్లీల కార్యకలాపాలను చూసి పెద్దవాళ్లు ఎవరైనా ఇదేమిటని మందలిస్తే వారిపై దాడులకు దిగుతున్నారు.

యువతీ యువకులు జంటగా ఇక్కడకు రావడం.. అసభ్యకరంగా ప్రవర్తించడం సాధారణ సందర్శకులకు ఇబ్బందికరంగా ఉంటోంది. కుటుంబ సభ్యులతో సాయంత్రం సరదాగా వచ్చిన వారికి ఇక్కడి పరిస్థితులు జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాయి. చెట్ల చాటున, పొదల మాటున తిష్ట వేసి.. ఇంగితజ్ఞానాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాయి ప్రేమజంటలు. తరగతి గదుల నుంచి దొంగచాటుగా బయటపడి శిల్పారామానికి చేరుతున్న విద్యార్థులు.. పెద్దలు తిరుగుతున్నారు, చిన్నారులు చూస్తున్నారన్న స్పృహ లేకుండా ఈ 'సుఖమే' మేం కోరుకుంటాం అంటూ పెనవేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/