Begin typing your search above and press return to search.
బెట్ కోసం గర్ల్‌ఫ్రెండ్ ప్రాణం తీశాడు..! గడ్డకట్టి చలిలో నరకం అనుభవించిన యువతి
By: Tupaki Desk | 13 Dec 2020 1:21 PM ISTస్నేహితుడితో కట్టిన పందెం కోసం ఓ వ్యక్తి తన ప్రియురాలు ప్రాణం తీశాడు. రష్యాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలు గర్భవతి అన్న విషయం కూడా ఓ వ్యక్తికి మరిచిపోయాడు. కేవలం 1300 డాలర్ల కోసం తన ప్రేయసిని చంపుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రష్యా చెందిన స్టాస్ రీఫ్లే (28).. వాలంటీనా గ్రిగర్‌యేవా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం వాలంటీనా గర్భిణి. అయితే స్టాస్ రీప్లే అతడి స్నేహితుడు ఓ పందెం కాశాడు. గడ్డకట్టే చలిలో తన ప్రియురాలును 15 నిమిషాలు ఉంచాలని ఆ పందెం సారాంశం.
దీంతో వాలంటీనా కేవలం బికినీ డ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమెను బాల్కనీలో ఉంచి డోర్ పెట్టేశాడు. అమె చలికి వణికిపోయింది. అరిచేందుకు కూడా నోరు రాలేదు. డోర్ ఎంతకొట్టినా అతడు కనికరించలేదు. చివరకు 15 నిమిషాల తర్వాత డోర్ తీశాడు. గడ్డ కట్టే చలిలో వాలంటీనా బిగుసుకుపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆమె మృతిచెందింది.
ప్రస్తుతం స్టాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. బెట్ కోసం ప్రియురాలిని హింసించడం ఏమిటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయినా ఇటువంటి పందెలు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.