Begin typing your search above and press return to search.

ప్రియురాలి మోసం.. కెనడాలో తెలుగు యువకుడి ఆత్మహత్య!

By:  Tupaki Desk   |   16 Nov 2020 4:40 PM IST
ప్రియురాలి  మోసం.. కెనడాలో తెలుగు యువకుడి  ఆత్మహత్య!
X
ప్రియురాలు మోసగించడంతో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన సంచలనం సంచలనం సృష్టించింది. హైదరాబాద్​లోని హబ్సిగూడకు చెందిన ప్రణయ్​ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే తన ప్రేయసి తనను వివాహం చేసుకోకుండా మోసం చేసిందని.. గతంలో మరో నలుగురు యువకులను కూడా ఇలా మోసం చేసిందని ఓ సెల్ఫీ వీడియో తీసి, సూసైడ్​ నోట్​ రాసి ప్రణయ్​ ఆత్మహత్య చేసుకున్నాడు.


‘నా ప్రేయసి తరచూ సిగరెట్లు తాగేది. నన్ను కూడా సిగరెట్లు తాగాలని బలవంతం చేసేది. ఆమెకు అంతకుమందు నలుగురు ప్రియులున్నారు. వాళ్లందరికి బ్రేకప్​ చెప్పి నన్ను ప్రేమించింది. నన్ను పెళ్లిచేసుకుంటానని మోసం చేసింది. నా ముందే మాజీ బాయ్​ఫ్రెండ్​తో చాటింగ్​ చేసేది. వీడియో కాల్​లో మాట్లాడేది. చివరికి హెచ్1 వీసా రాగానే తనకు తెలియకుండా మోసం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు కూడా కూతురుకే సపోర్ట్​ చేస్తున్నారు.

నాతో చాలాకాలం పాటు సహజీవనం చేసింది. చివరకు ఇలా మోసం చేస్తుందని ఊహించకలేకపోయాను. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా. నా శరీర అవయవాలు కూడా దానం చేయండి’ అంటూ ప్రణయ్​ సూసైడ్​ నోట్​ రాశాడు.

ప్రణయ్​ చనిపోయినట్టు కెనడాకు చెందిన అధికారులు ప్రణయ్​ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వాళ్లు ప్రస్తుతం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ ఆసరాగా ఉన్న కన్న కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తాడని ఊహించలేదని వాళ్లు రోదించడం కలచివేసింది.