Begin typing your search above and press return to search.

మానవహక్కుల కమిషన్ ఆఫీసు ముందే ప్రియుడ్ని ఉతికేసింది

By:  Tupaki Desk   |   1 Jan 2021 10:02 AM IST
మానవహక్కుల కమిషన్ ఆఫీసు ముందే ప్రియుడ్ని ఉతికేసింది
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని మానవహక్కుల కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన ఒక మహిళ.. తన మాజీ ప్రియుడ్ని ఉతికి ఆరేసింది. మూడేళ్లు సహజీవనం చేసి.. ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నారంటూ ఆరోపణ చేశారు. దీనికి సంబంధించిన విచారణ కోసం వారిరువురు వచ్చారు. కమిషన్ ప్రాంగణలోకి వచ్చిన ప్రియుడ్ని చూసిన యువతి తీవ్ర ఆగ్రహానికి గురైంది. అంతే.. అతడి మీద దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా దూషిస్తూ.. మోసం చేస్తావా? అంటూ తాట తీసింది.

దీంతో బిత్తరపోయిన పోలీసులు... ఇరువురిని విడదీసి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. వనపర్తి జిల్లాకు చెందిన ఒక యువతి హైదరాబాద్ లోని సెక్రటేరియ్ లో జాబ్ చేస్తున్న అశోక్ కుమార్ తో కలిసి మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని అడిగితే.. అబార్షన్ చేయించినట్లు చెబుతోంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం రావటంతో తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె ఆరోపించింది.

మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నాలు షురూచేశాడని పేర్కొంది. దీంతో.. కుషాయగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదన్నారు. అందుకే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించానని.. అయినప్పటికి వారు జోక్యం చేసుకోలేదని ఆమె చెప్పారు. కోర్టులో కేసు ఉందని చెబుతున్నారని.. తాను కమిషన్ ను ఆశ్రయించినప్పుడు కేసు కోర్టులో ఉందని తెలీదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే.. కమిషన్ కార్యాలయం వద్దే.. తనను మోసం చేసిన ప్రియుడ్ని ఉతికేసిన వైనం సంచలనంగా మారింది.