Begin typing your search above and press return to search.
తల్లిని చంపి.. తమ్ముడిని పొడిచి.. ప్రియుడితో జంప్
By: Tupaki Desk | 6 Feb 2020 3:00 PM ISTకన్నతల్లినే కడతేర్చిన కసాయి కూతురు ఉదంతం ఐటీ సీటీ బెంగళూరులో కలకలం సృష్టించింది. తల్లిని కత్తితో పొడిచి అండమాన్ పారిపోయిన కూతురు ఉదంతం చర్చనీయాంశమైంది. యువతిని పోలీసులు కష్ట నష్టాలకు ఓర్చి పట్టుకొని అరెస్ట్ చేశారు.
బెంగళూరులో నివాసముంటున్న నిర్మలను ఆమెకు కూతురు అమృత ఈనెల 2వ తేదీన కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసింది. తల్లితోపాటు అడ్డువచ్చిన తమ్ముడు హరీష్ ను కూడా అమృత పొడిచేసింది. ఇద్దరూ అపస్మార స్థితికి చేరుకున్నాక తన ప్రియుడు శ్రీధర్ రావు తో కలిసి బెంగళూరు విమానాశ్రయం నుంచి అండమాన్ కు విమానంలో పారిపోయింది. శ్రీధర్ రావు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అండమాన్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో తల్లి నిర్మల చనిపోగా.. తమ్ముడు హరీష్ చావు బతుకుల మధ్య కోమాలో ఉన్నాడు.
అయితే సొంత తల్లిని, తమ్ముడిని అమృత పొడవడానికి ప్రేమ, ఆర్థిక పరమైన విభేదాలు కారణం కావని.. ఆమె మానసికంగా డిస్ట్రబ్ అయ్యిందని అందుకే హత్య చేసిందని పోలీసుల విచారణలో తేలింది. తండ్రి కేన్సర్ వ్యాధి కోసం చేసిన అప్పు18లక్షలకు చేరడం.. అవి తీర్చే మార్గం లేక పోవడం.. కుటుంబం అప్పుల ఊబిలో కూరుక పోవడంతో అమృత డిస్ట్రబ్ అయ్యి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.
అప్పుల నుంచి బయటపడడానికి తల్లి, తమ్ముడిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని యోచించింది. కానీ తర్వాత ప్రియుడి తో అండమాన్ వెళ్లి పోయింది. పోలీసుల విచారణ లో ఈ సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి.