Begin typing your search above and press return to search.
పోలింగ్ తక్కువంటూ రచ్చ చేస్తున్నారు కానీ.. గణాంకాల్ని గమనించారా?
By: Tupaki Desk | 2 Dec 2020 10:00 AM ISTమీడియాను సోషల్ మీడియా డామినేట్ చేయటం మొదలు పెట్టి చాలా కాలమే అయ్యింది. ఒకే విషయాన్ని నలుగురు అదే పనిగా మాట్లాడినంత మాత్రాన.. అబద్ధం నిజం అయిపోతుందా? అంటే.. కాదంటారు. కానీ.. మీడియా బుర్ర మట్టితో నిండిపోతున్న వేళ.. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పక తప్పదు. అరకొర సమాచారంతో.. ఆగమాగం చేసేయటం.. దాన్నే నిజంగా భావించటం లాంటివి ఈ మధ్యన ఎక్కువైంది. సంచలనం కోసం.. ఎప్పటికప్పుడు విషయాల్ని కొత్తగా చూపించాలన్న ఆత్రుతతో టీవీ చానళ్లు చేసే హడావుడి తెలిసిందే.
వారితో పోటీ పడుతున్న సోషల్ మీడియా.. మరో ఆకు ఎక్కువ చదివిందని చెప్పాలి. ఏదైనా విషయం మీద ఒకసారి డిసైడ్ అయితే.. దాని మీదనే ఫోకస్ పెట్టి.. అసలు విషయాన్ని వదిలేస్తున్న తీరు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా గ్రేటర్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనం. మంగళవారం సాయంత్రం నుంచి టీవీ చానళ్లు.. సోషల్ మీడియా ఒకటే హడావుడి. హైదరాబాదీ ఓటర్లు ఎంత బద్ధకస్తులు. వారికి ఏమీ పట్టదు. తిని.. ఇంట్లో తొంగోటమే తప్పించి.. ఓట్లు వేసేందుకు బయటకు రారే అంటూ ప్రచారం మొదలు పెట్టేశారు.
దీనికి సంబంధించిన కొన్ని గణాంకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. గ్రేటర్ కు జరిగిన ఎన్నికల్లో కేవలం 30 శాతమే పోలింగ్ నమోదై అయ్యిందంటూ స్క్రోలింగ్స్.. బ్రేకింగ్ న్యూసుల్ని టీవీ చానళ్లు మొదలు పెడితే.. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్..మీమ్స్ తో ఉతికి ఆరేశారు. ఇంత హడావుడి మధ్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మరుగన పడిపోయాయి. నిజంగానే.. పోలింగ్ శాతం తక్కువగా ఉందా? అంటే లేదనే మాట చెప్పాలి.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల్ని చూస్తే.. గడిచిన కొంతకాలంగా నమోదైన పోలింగ్ తో పోలిస్తే.. తాజా ఎన్నికల్లోనే ఎక్కువ పోలింగ్ జరిగిందని చెప్పాలి. 2002 గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటర్లు 43.27 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకుంటే.. 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 42.92 శాతం నమోదైంది. ఇక.. 2016లో జరిగిన స్థానిక సమరంలో 45.27 శాతం నమోదు కాగా.. తాజా ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్ నమోదైనట్లుగా పేర్కొన్నారు. అంటే.. గడిచిన మూడు ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే.. తాజా పోలింగే ఎక్కువ.
నిజానికి ప్రస్తుతం చాలా ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నది మర్చిపోకూడదు. కరోనా నేపథ్యంలో లక్షలాది కుటుంబాలు హైదరాబాద్ నుంచి తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లటం తెలిసిందే. వర్కు ఫ్రం హోం అవకాశాన్ని ఐటీ కంపెనీలు ఇవ్వటంతో వెళ్లిపోయారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు హాఫ్ డే మాత్రమే లీవ్ ఇచ్చారు. వీటితో పాటు.. నాలుగు రోజులు వరుసగా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మాత్రం పోలింగ్ నమోదు కావటం.. గతంతో పోలిస్తే ఎక్కువగా ఉండటం చూసినప్పుడు.. గ్రేటర్ పోలింగ్ మీద జరిగిన రచ్చ అంతా కొందరి అత్యుత్సాహంగా చెప్పక తప్పదు. వాస్తవాల్ని మసిపూసి.. తమకు నచ్చిన రీతిలో ప్రచారం చేయటం.. వాటిని నిజమని నమ్మేయటం తాజా ఎన్నికల ప్రత్యేకతగా చెప్పక తప్పదు.