Begin typing your search above and press return to search.
హైదరాబాదీలు.. జూలై 1 నుంచి జాగ్రత్త..
By: Tupaki Desk | 21 Jun 2019 1:00 PM ISTఈ-చాలన్... తెలంగాణలో రోడ్ల మీద వెళ్లే వాహనదారులకు ఈ పదం అంటే భయపడుతారు. రోడ్డుపై యాష్ డ్రైవింగ్ చేసినా.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని మళ్లించినా.. రోడ్డు క్రాస్ చేసినా.. హెల్మెట్ పెట్టుకోకపోయినా ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి ఫైన్ ను ఇంటికి ఈ చాలన్ పంపిస్తారు. దీంతో చచ్చుకుంటూ ఆ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. మూడు సార్లు అలా జరిగితే లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.
ఇప్పుడు ట్రాఫిక్ ఈ-చాలెన్ తరహాలోనే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కూడా ఈ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది.
జూలై 1 నుంచి ఈ విధానం హైదరాబాద్ లో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా చెత్త వ్యర్థాలు రోడ్డుపై వేసినా.. అనుమతి లేని ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టినా.. గోడలపై రాతలు రాసిన వారికి ఈ-చాలెన్ రూపంలో జరిమానా విధిస్తారు. రోడ్లపై మూత్రవిసర్జన చేసినా ఫైన్ విధిస్తారు. రూ.100 నుంచి రూ.10000 వరకు ఈ జరిమానా విధించేందుకు రంగం సిద్ధమైంది.
జీహెచ్ ఎంసీ ఇందుకోసం పోలీసుల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీని వినియోగిస్తోంది. దీని ఆధారంగా ఉల్లంఘనులను గుర్తిస్తారు.ఈ 25 రోజుల్లోనే ఉల్లంఘనులకు రూ.26 లక్షలు జరిమానా విధించారు. వెహికల్ నంబర్ ఆధారంగా అడ్రస్ కు రూ.100 ఈ-చాలానా పంపుతారు. నిర్ణీత గడువులోపు ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆస్తిపన్నులో కలిపేలా ఆలోచిస్తున్నారు. ఇక ఇందుకోసం గస్తీ నిర్వహించే ప్రత్యేక బృందాలు నిబంధనలు ఉల్లంఘించే వారి పేరు, మొబైల్ నంబర్, ఇతరత్రా వివరాలు తీసుకొని చలానా పంపుతారు. ఆ జరిమానా ను ఆన్ లైన్, లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్లలో చెల్లించేలా అవకాశం ఉంటుందని హైదరాబాద్ విజిలెన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ఇక మల- మూత్ర విసర్జన- చెత్త వేయడం చేసిన వారిని గుర్తించి మొబైల్ లో ఫోటో తీసి జీహెచ్ ఎంసీకి పంపే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ‘సీఈసీ’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.
*నిబంధనలు ఉల్లంఘించే వారికి నిర్ణయించిన జరిమానాలివే..
*నాలాల్లో నిర్మాణ రంగ వ్యర్థాలు వేస్తే-10000
*నిర్మాణ రంగ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే -10000
*అక్రమంగా బ్యానర్లు, కటౌట్లు కడితే- 5000
*వాల్ పోస్టర్లు అంటిస్తే -2000
గోడరాతలు రాస్తే-1000
బహిరంగ మూత్ర విసర్ఝన -100
రోడ్డుపై చెత్త వేస్తే -100
బల్క్ గ్యారేజ్ రోడ్లపై వేస్తే -2000
దుకాణాల ముందు చెత్త వేస్తే -1000
నాలాలో చెత్త వేస్తే -1000