Begin typing your search above and press return to search.

మంత్రి ఫ్లెక్సీలకు జిహెచ్ఎంసి రూ.3 లక్షలు ఫైన్

By:  Tupaki Desk   |   6 Oct 2020 11:03 PM IST
మంత్రి ఫ్లెక్సీలకు జిహెచ్ఎంసి  రూ.3 లక్షలు ఫైన్
X
తెలంగాణ టి ఆర్ ఎస్ కీలకనేత, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు నేడు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమంకి స్పూర్తిగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు పురష్కరించుకొని కొంతమంది మంత్రి పై ఉన్న అభిమానం తో అయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే , నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకులకు జీహెచ్ ఎం సీ అధికారులు జరిమానా విధించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు చోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంప్ ఆఫీసు దగ్గరలో కూడా కొన్నిఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గాను ఐకాన్ డిజిటల్ మీడియా సంస్థకు రూ.3 లక్షలు ఫైన్ వేశారు అధికారులు.