Begin typing your search above and press return to search.
జనవరి చివర్లో.. ఫిబ్రవరి మొదట్లో గ్రేటర్ ఎన్నికలు?
By: Tupaki Desk | 5 Nov 2020 11:00 AM ISTగ్రేటర్ ఎన్నికలు ఎప్పడు జరుగుతాయి? ఇప్పుడీ ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. తొలుత డిసెంబరు చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో ఎన్నికల్ని నిర్వహించేలా ప్లాన్ చేయటం తెలిసిందే. అధికారికంగా నిర్ణయం తీసుకోకున్నా.. అప్పుడున్న సానుకూల పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని డిసెంబరు-జనవరి మధ్యలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని భావించారు.
అనుకోని రీతిలో చోటు చేసుకున్న భారీ వర్షాలు.. వరదలతో మహా నగరం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. లక్షలాది మంది ప్రభావితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు వెళ్లటం ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపించింది. ఫిబ్రవరిలో గ్రేటర్ పాలకమండలి గడువు పూర్తి కానుంది. ఈ లోపు ఎన్నికలకు వెళ్లటం బాగోదన్న భావనతో.. మూడు నెలల ఆలస్యంగా ఎన్నికల్ని నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న మాట వినిపించింది.
అయితే.. అందుకు భిన్నంగా ఆలోచనలు సాగుతున్నట్లు చెబుతున్నారు. వరద సాయం పంపిణీలో కొంత నిరసనలు ఎదురైనా.. మొత్తంగా చూస్తే.. ప్రభుత్వం స్పందించినతీరుపై నగర ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా చెబుతున్నారు. తాము అనుకున్నట్లు వరద సాయంపై ప్రజల్లో సానుకూలత నెలకొందని.. ఈ నేపథ్యంలో ఎన్నికల్ని ఆలస్యంగా కాకుండా.. గడువు తీరే లోపు నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.
గతంలో మాదిరి నవంబరుచివర్లో మొదలుపెట్టి.. డిసెంబరు నాటికి లేదంటే.. డిసెంబరు చివరి నాటికి ఎన్నికల్ని పూర్తి చేయాలని తొలిదశలో చర్చలు జరిగినా.. ఇప్పుడు వాటిని కాస్త మార్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. జనవరి మధ్యలో వచ్చే సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి చివరిలో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి.. ఫిబ్రవరి మొదటి వారాంతంలో ఎన్నికలు పూర్తి అయ్యేలా చేస్తే..గడువులోపు ఎన్నికల్ని నిర్వహించినట్లు అవుతుందన్న యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.
తాము అనుకున్న తేదీల్ని ఎన్నికల కమిషన్ కు తెలియజేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం గ్రేటర్ ఎన్నికలపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలన్న నిబంధన ఉండటంతో అనువైన తేదీల గురించి ఎన్నికల సంఘం అడుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. జనవరి చివరివారం నుంచి ఫిబ్రవరి మొదటి.. రెండు వారాల్లోపు ఎన్నికల్ని పూర్తి చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్న మాట బలంగా వినిపిస్తోంది.