Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఎన్నికలు ఏమో కానీ.. తలబాదుకుంటున్న మీడియా
By: Tupaki Desk | 2 Dec 2020 5:00 PM ISTకుడితిలో పడ్డ ఎలుకపిల్ల మాదిరిగా మారింది మీడియా పరిస్థితి. గ్రేటర్ కు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ చాలా తక్కువ నమోదైందంటూ.. చానళ్లు.. వెబ్ సైట్లు.. సోషల్ మీడియా పెద్ద ఎత్తున తిట్ల వర్షం కురిపించంటం.. తీరా చూస్తే.. గడిచిన మూడు స్థానిక ఎన్నికల కంటే ఎక్కువగా నమోదు కావటంతో.. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావట్లేదన్న విషయాన్ని చెప్పే క్రమంలో నోటికి వచ్చినట్లుగా గ్రేటర్ ఓటర్లను తిట్లతో ఆడేసుకున్నాయి చానళ్లు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మీడియా ప్రతినిధులకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. నిన్న పోలింగ్ పూర్తి అయ్యాక ఇచ్చిన విశ్లేషణ ఇప్పుడు వారికి కొత్త తిప్పల్ని తెచ్చి పెట్టింది. పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే ఒకలా.. తక్కువలా ఉంటే మరోలాంటి ఫలితం వస్తుందన్న అంచనాల్ని వినిపించే క్రమంలో.. వారు కొన్ని ఆణిముత్యాల్లాంటి అంశాల్ని చెప్పుకొచ్చారు.
ఇక.. మీడియా సంస్థల్లో జరిగిన అంతర్గత సమావేశాల్లో పేర్కొన్న అంశాలు.. వినిపించిన వాదనలు ఇప్పుడేమని సమాధానాలు చెప్పాలన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. నిన్న తక్కువ పోలింగ్ జరిగిందనుకుంటే.. ఇప్పుడేమో 46 శాతం పోలింగ్ జరిగిందన్న విషయాన్ని ఎన్నికల సంఘం చెబుతుండటంతో.. నిన్నటి విశ్లేషణను.. ఇప్పుడు ఎలా సర్ది చెప్పాలన్నది ప్రశ్నగా మారింది. గ్రేటర్ ఎన్నికలు ఏమో కానీ.. మాకు కొత్త తలపోటు వచ్చి పడిందే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.