Begin typing your search above and press return to search.
ఓల్డ్ మలక్ పేట లో ఎన్నిక రద్దు..రీపోలింగ్ ఎప్పుడంటే?
By: Tupaki Desk | 1 Dec 2020 1:45 PM ISTగ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ఉదయం నుండి కొంచెం మందకొడిగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి అంతగా కనిపించడం లేదు. చాలా చోట్ల ప్రముఖులు తొలి రెండు గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇకపోతే , ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఓటు వేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండటంతో గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు
ఇదిలా ఉంటే , ఓ చిన్న పొరపాటు కారణంగా ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో పోలింగ్‌ను రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం . అక్కడ రీపోలింగ్ జరగనుంది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. బ్యాలెట్ పత్రాల్లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి ఉంది. సీపీఐ ఈ అంశాన్ని ఎస్ ఈ సీ దృష్టికి తీసుకెళ్లింది. ఓల్డ్ మలక్ పేటలో గుర్తుల తప్పులపై స్పందించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్... ఓల్డ్ మలక్‌పేట ఘటనలో జిహెచ్ఎంసి కమిషనర్ నుంచి విచారణ రిపోర్టు అందల్సి ఉందని, దీనిపై చర్యలు తీసుకుంటామని ఎస్ ఈసీ ప్రకటించింది. దీంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.