Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్‌ లో బీజేపీది గెలుపు కాదా? ఎమోష‌న్‌తో నెట్టుకొచ్చిందా?

By:  Tupaki Desk   |   7 Dec 2020 10:34 AM IST
గ్రేట‌ర్‌ లో బీజేపీది గెలుపు కాదా?  ఎమోష‌న్‌తో నెట్టుకొచ్చిందా?
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో క‌మ‌ల ద‌ళం చేసిన భారీ ప్ర‌చారం.. అతిర‌థ‌మ‌హారథులైన రాజ‌కీయ నేత లు అమిత్ షా, యోగి ఆదిత్య‌నాథ్‌, ఫ‌డ్న‌వీస్ వంటివారి ప్ర‌సంగాలు క‌లిసి వ‌చ్చాయ‌ని.. అందుకే 2016 గ్రేట‌ర్ పోరులో కేవ‌లం 4 డివిజ‌న్ల‌కే ప‌రిమిత‌మైన బీజేపీ.. ఇప్పుడు భారీగా 48 డివిజ‌న్ల‌ను కైవ‌సం చేసు కుంద‌ని పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇది నిజ‌మేనా? గ్రేట‌ర్‌లో బీజేపీ నైతికంగానే గెలిచిం దా? అంటే.. తాజాగా అందుతున్న విశ్లేష‌ణ‌లు వార్త‌ల‌ను బ‌ట్టి.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం ఎమోష‌న్ ట‌చ్ కార‌ణంగానే బీజేపీ పుంజుకుంద‌ని చెబుతున్నారు.

విష‌యం ఏంటంటే.. ఐటీ ఉద్యోగులు, పారిశ్రామిక వేత్త‌లు, విద్యావంతులు ఉన్న డివిజ‌న్ల‌లో బీజేపీకి ఓట్లు ప‌డ‌లేదు. అదేస‌మ‌యంలో అధికార టీఆర్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం క‌మలం విక‌సించింది. అదేస‌మ‌యంలో వ‌ల‌స వ‌చ్చిన ప్ర‌జ‌లు కూడా టీఆర్ ఎస్‌కే ఓటు వేశారు. కానీ, తెలంగాణలో స్థానికంగా ఉన్న వారు మాత్రం బీజేపీవైపు మొగ్గు చూపారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంటి? కేసీఆర్‌పై వ్య‌తిరేక‌తా? లేక ప్ర‌భుత్వ విధానాల‌పై విసుగా అంటే.. కానేకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం బీజేపీ చేసిన ఎమోష‌న‌ల్ ప్ర‌సంగాలే!!

ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. లోతైన విశ్లేష‌ణ‌లు దీనినే నిజ‌మ‌ని అంటున్నాయి. బీజేపీ నేత‌లు గ్రేట‌ర్ ప్ర‌చారంలో చివ‌రి నాలుగు రోజులు.. హిందూ-ముస్లింల మ‌తాల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగాలు దంచికొట్టారు. ముఖ్యంగా రోహింగ్యా ముస్లింల‌కు హైద‌రాబాద్ స్థావ‌రం అయిపోయింద‌ని వ్యాఖ్యానిం చారు. దీంతో ఇది భావావేశాల‌కు దారితీసింది. అంతిమంగా ఇది బీజేపీకి లాభించింది. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. ఈ ఎమోష‌న‌ల్ ప్ర‌సంగాలు.. ఎంఐఎంకు కూడా లాభించాయి. వాస్త‌వానికి హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ముస్లింలు.. ఎంఐఎం వైఖ‌రిపై అసంతృప్తిగా ఉన్నారు.

దీంతో అభ్య‌ర్థుల ఎంపిక నుంచి ప్ర‌చారం వ‌ర‌కు కూడా ఎంఐఎం ఆచితూచి వ్య‌వ‌హ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌ని అస‌దుద్దీన్ ఓవైసీ అంచ‌నావేసుకున్నారు. అయితే.. ఎప్పుడైతే.. బీజేపీ హిందూ-ముస్లిం అంటూ.. ప్ర‌సంగాలు దంచికొట్టిందో.. ముస్లింల ఓట్ల‌న్నీ ఎంఐఎంవైపు మ‌ళ్లిపోయాయి. అదేవిధంగా ఎంఐఎం నేత‌లు.. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌ల‌ను కూల్చేస్తాం.. అంటూ చేసిన వ్యాఖ్య‌లు హిందూ వ‌ర్గాన్ని బీజేపీకి చేరువ చేశాయి. అయితే.. ఈ సెంటిమెంటు ఓట్లు, ఎమోష‌న‌ల్ ఓట్ల‌తో బీజేపీ పునాదులు గ‌ట్టి ప‌డ‌తాయా? అంటే క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ్రేట‌ర్ అభివృద్ధికి బీజేపీ క‌ట్టుబ‌డితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకువ‌చ్చి.. ఇక్క‌డి డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను ముఖ్యంగా లోత‌ట్టు ప్రాంతాల అభివృద్ధిని ప‌ట్టించుకుంటే.. ఐటీని మ‌రింత‌గా అభివృద్ధి చేస్తేనే.. బీజేపీకి పునాదులు ప‌డ‌తాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఇప్ప‌టికే క‌ష్టం ప‌డ్డాం.. ఇది చాలు అనుకుంటారో.. లేక మున్ముందు పుంజుకునేందుకు అభివృద్ధి మంత్రాన్ని జ‌పిస్తారో చూడాలి.