Begin typing your search above and press return to search.
జీహెచ్ ఎంసీ ట్విట్టర్ లో రికార్డ్ ఫాలోవర్లు!
By: Tupaki Desk | 28 July 2019 4:23 PM ISTట్విట్టర్ వేదికగా రాజకీయ నేతల నుంచి ప్రభుత్వ యంత్రాంగాల వరకు కూడా ప్రజలకు చేరువ అవుతున్నాయి. ప్రతి విషయంపైనా ట్విట్టర్ వేదికగా అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో అనేక నగరపాలక సంస్థలు ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందించేందుకు ట్విట్టర్‌ను వాడుకుంటున్నాయి. ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు - వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కూడా ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ముంబై - చెన్నై - ఢిల్లీ వంటి కీలక నగర పాలక సంస్థలు ట్విట్టర్ వేదికగా నిత్యం ప్రజలను పలకరిస్తున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాద్ లోని బల్దియా కూడా ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తోంది. దీంతో ప్రజలు వివిధ సమస్యలను ఈ ట్విట్టర్ ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తెచ్చి వాటికి పరిష్కారాలను పొందు తున్నారు. ముఖ్యంగా గతంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోషల్ మాధ్య మాన్ని వేదికగా చేసుకుని ప్రజలకు చేరువ అయ్యారు. ఈ క్రమంలోనే బల్దియా ట్విట్టర్ కు అనూహ్యంగా ఫాలోవర్లు పెరిగిపోయా రు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. దేశంలో ఏ మునిసిపల్ కార్పొరేషన్ కూ లేని స్థాయిలో బల్దియా ఖాతాకు ఫాలోవర్లున్నారని సంస్థ వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ కార్పొరేషన్ ను 40,100 మంది - బెంగళూరు కార్పొరేషన్ ను ట్విటర్ లో 26800 - పుణే 21,400 మంది ఫాలో అవుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో అగ్రస్థానంలో నిలిచిన సూరత్ కార్పొరేషన్ ట్విటర్ ఖాతాను కేవలం 4,100 మంది ఫాలో అవుతున్నారు. గ్రేటర్ విశాఖ - విజయవాడ - వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ల ఖాతాను 4 వేల మంది లోపే ఫాలో అవుతున్నారు.
జీహెచ్ ఎంసీ కమిషనర్ పేరిట ఉన్న ట్విటర్ ఖాతానూ 55,400 మంది ఫాలో అవుతుం డడం గమనార్హం. ఇంత రికార్డు సొంతం చేసుకోవడం వెనుక ఖచ్చితంగా కేటీఆర్ కృషితో పాటు బల్దియా కమిషనర్ దాన కిషోర్ కృషి కూడా ఉందని అంటున్నారు అధికారులు. బల్దియా కమిషనర్‌గా వచ్చిన ఆయన ప్రజల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. నేరుగా కార్యాలయాలకు రాకుండా - సోషల్ మాధ్యమాల ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అటు ప్రజల సమయం - ఇటు అధికారుల సమయం కూడా వృథా కాకుండా చర్యలు తీసుకున్నారు.
ట్విట్టర్ లో స్పందించడం * ట్విట్టర్ సమస్యలకు వెంటనే పరిష్కారాలు చూపించడం వంటివి అనతి కాలంలోనే ప్రజల్లోకి దూసుకు పోయాయి. నిత్య ఎంతో బిజీగా ఉండే హైదరాబాదీలు.. కమిషనర్ దానకిషోర్ ముందుచూపుకు ఫిదా అయ్యారు. తమ సమస్యలను ఎక్కడి నుంచైనా.. ఫిర్యాదు చేసేందుకు ట్విట్టర్ ను విస్తృతంగా వాడుకున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ ఎంసికీ 55, 400 మంది ఫాలోవర్లు ఉండడం గమనార్హం. మొత్తానికి దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సంస్థ గా జీహెచ్ ఎంసీ నిలవడం రికార్డు అంటున్నారు హైదరాబాదీలు.