Begin typing your search above and press return to search.

ఇంటర్ అమ్మాయితో పెళ్లైనోడి ప్రేమ.. రెండు డెడ్ బాడీలు!

By:  Tupaki Desk   |   1 Nov 2022 8:43 AM GMT
ఇంటర్ అమ్మాయితో పెళ్లైనోడి ప్రేమ.. రెండు డెడ్ బాడీలు!
X
ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆ యువకుడికి ఇప్పటికే పెళ్లైంది. ఎలా జరిగిందో కానీ.. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ మొదలైంది. ఈ ఇద్దరు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. ఇది జరిగిన కొంతకాలానికి ఒక యువతి డెడ్ బాడీ దొరికింది. దీంతో.. కనిపించకుండా పోయిన కుమార్తె తల్లిదండ్రులు.. ఆ డెడ్ బాడీ తమ కుమార్తెగా చెప్పారు. అంతలోనే.. ఆమెతో వెళ్లిన యువకుడి డెడ్ బాడీ లభించింది. కట్ చేస్తే.. తాజాగా వారిద్దరు తాము క్షేమంగా ఉన్నామని.. త్వరలోనే ఊరికి వస్తామంటూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తీసిపోని మలుపులు ఈ స్టోరీ సొంతంగా చెప్పాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచనలంగా మారింది. తొలుత పరువు హీత్యగా.. తర్వాత అనూహ్య మలుపుల మధ్య అసలేం జరిగింది? ఏం జరుగుతుందో అర్థం కాని రీతిలో మారిన ఈ ఉదంతం ఒక ఎత్తు అయితే.. ఇందులో రాజకీయం కూడా ఎంట్రీ కావటం ఇప్పుడీ ఉదంతం కొత్త మలుపు తిరిగినట్లైంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రామాపురానికి చెందిన చంద్రశేఖర్.. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ నగర్ కు చెందిన చంద్రిత ప్రేమించుకున్నారు. చంద్రశేఖర్ వాలంటీర్ గా పని చేస్తుంటాడు. అతడికి పెళ్లై. ఒక బాబు కూడా ఉన్నారు. చంద్రిత ఇంటర్ చదువుతోంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 10న వారిద్దరూ కనిపించకుండాపోయారు. అప్పటి నుంచి వారిద్దరి ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కేవీబీపుర మండలం పరిధిలోని తెలుగుగంగ కాల్వలో బాగా ఉబ్బిన స్థితిలో ఉన్న ఒక గుర్తు తెలియని యువతి శవం కనిపించింది.

గుర్తు తెలియని ఆ డెడ్ బాడీని గుర్తించే క్రమంలో చంద్రిత తల్లిదండ్రుల్ని పిలిపించారు. దాన్ని చూసిన వారు.. డెడ్ బాడీ మీద ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా.. చంద్రిత డెడ్ బాడీగా చెప్పారు. దీంతో.. ఈ ఉదంతంసంచలనంగా మారటంతో పాటు.. విపక్షాలు బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏర్పేడు మండలం పరిధిలో ఒక గుర్తు తెలియని యువకుడి శవాన్ని గుర్తించారు. అతను.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ గా గుర్తించారు. దీంతో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా డీఎన్ఏ పరీక్ష్= చేపట్టారు. అయితే.. ఈ డెడ్ బాడీ కనిపించకుండా పోయిన చంద్రశేఖర్ ది కాదని తేలింది.

ఇదే సమయంలో.. ఊరి నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్.. చంద్రితలు కలిసి ఒక వీడియో తీసి విడుదల చేశారు. తామిద్దరం క్షేమంగా ఉన్నామని.. త్వరలోనే ఊరికి కూడా రానున్నట్లు పేర్కొన్నారు. దీంతో.. గుర్తు తెలియని డెడ్ బాడీల్లో ఉన్న వారెరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఒకవైపు గుర్తు తెలియని డెడ్ బాడీలు ఎవరివి? అన్నది ఒక ప్రశ్న అయితే.. మరోవైపు న్యాయం కోసం ఆందోళన చేసిన జనసేన.. టీడీపీకి చెందిన కార్యకర్తల మీదా.. వీడియో విడుల చేసిన వారిపై చంద్రశేఖర్ మండిపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో.. విపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంటర్ చదివే అమ్మాయిని తీసుకెళ్లిన చంద్రశేఖర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతకంతకూ కొత్త మలుపులు తిరగటం.. ప్రశ్నలే తప్పించి సమాధానాలు లభించని పరిస్థితి. మొత్తంగా ఈ జంట తిరిగి వస్తే తప్పించి.. సందేహాలకు సమాధానం లభించదన్న మాట వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.